రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీఏ తరపున జేడీయూ ఎంపీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ సన్నిహితుడు హరివంశ్‌ను నిలబెట్టాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. హరివంశ్ కోసం… బీహార్ సీఎం రంగంలోకి దిగారు. ఎన్డీఏ బయటి పార్టీల మద్దకు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఫోన్ చేశారు. హరివంశ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. కేసీఆర్ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని సమాధానం ఇచ్చారు. మరో వైపు జేడీయూ ఎంపీని ఎన్డీఏ తరపున నిలబెట్టాలని నిర్ణయించడం ఆ కూటమిలోని డు ప్రధాన భాగస్వామ్య పక్షాలైన.. అకాలీదళ్, శివసేనకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ రెండు పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని దాదాపుగా నిర్ణయించుకున్నాయి.
అకాలీదళ్ ఎంపీ నరేష్ గుజ్రాల్‌కు అవకాశం వస్తుందని బీజేపీ వర్గాలు చాలా కాలంగా చెబుతూ వస్తున్నాయి. కానీ హఠాత్తుగా మాటమాత్రంగా కూడా చెప్పకుండా.. హరివంశ్‌ను ఖరారు చేయడంతో అకాలీదళ్ అసంతృప్తికి గురయిది. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని డిసైడయింది. ఇక శివసేన బీజేపీతో చాలా కాలంగా విబేధిస్తోంది. హరివంశ్ విషయంలోనూ సంతృప్తిగా లేదు. టీడీపీ పెట్టిన అవిశ్వాసం విషయంలోనూ.. బీజేపీకి శివసేన షాక్ ఇచ్చింది. మద్దతుగా ఓటేయడానికి అంగీకరించలేదు. రెండు పార్టీలకు కలిపి రాజ్యసభలో ఆరుగురు ఎంపీలు ఉన్నారు. వీరు కూడా ఓటింగ్‌కు దూరం అయితే.. బీజేపీకి ఇబ్బందికర పరిస్థితే ఎదురవుతుంది.
నాన్ బీజేపీ అభ్యర్థిగా.. తమ పార్టీ ఎంపీని ప్రమోట్ చేయాడనికి జేడీయూ నేత నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్న అన్నాడీఎంకే, వైసీపీ, బీజేడీ, టీఆర్ఎస్‌ల మద్దతు లభిస్తుందని ఆశ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల తరపున ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలన్నది .. ఖరారు చేయడానికి మరోసారి పార్టీలన్నీ సమావేశం కాబోతున్నాయి. ఈ రెండు కూటములలో లేకుండా.. ఉన్న పార్టీలకు దాదాపుగా 30 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వాళ్లే ఫలితాన్ని నిర్ణయించబోతున్నారు.