నర్తనశాల… ఈ టైటిల్లోనే ఓ మ్యాజిక్ ఉంది. టైటిల్ చూస్తే… హీరో క్యారెక్టర్ని అంచనా వేసేయొచ్చు. నాగశౌర్య సినిమాకి ‘@ నర్తనశాల’ అనే టైటిల్ పెట్టగానే.. ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోందో అర్థమైపోయింది. దాన్నే ఖరారు చేస్తూ… టీజర్లో హీరో క్యారెక్టరైజేషన్ ఏమిటో చెప్పేశారు. ‘నువ్వు ఉత్తరంగాడివా’ అంటూ జేపీ డైలాగ్‌కి… నాగశౌర్య ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోతుంది. ‘నర్తనశాల’ ఏ రూటులో వెళ్లబోతోందో. చిన్నప్పటి నుంచీ ఆడగాలి సోకకుండా, ఆడపిల్లలా పెరిగిన ఓ కుర్రాడి కథ ఇది. తన ప్రేమకథలో ఎదురైన మలుపుల వల్ల తన కథ ఎన్ని యూ టర్న్‌లు తీసుకుందో తెలియాలంటే ‘నర్తనశాల’ చూడాల్సిందే. ఐరా క్రియేషన్స్‌పై నిర్మించిన చిత్రమిది. శ్రీనివాస చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. లవ్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్నీ సమపాళ్లలో మేళవించిన ఫీలింగ్ కలుగుతోంది. `ఛలో`తో ఓ సూపర్ హిట్ అందుకున్న శౌర్య… ‘నర్తనశాల’నీ విజయపథంవైపు నడిపించాలని చాలా కష్టపడ్డాడు. మరి ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాలి.