చిలసౌ, గూఢచారి రెండూ ఒకేరోజు విడుదలయ్యాయి. సమీక్షలు రెండి సినిమాలకూ మంచి రేటింగులే ఇచ్చాయి. జనాలు మాత్రం గూఢచారికి పట్టం కట్టారు. సెలబ్రెటీలు కూడా ఈసినిమా గురించే మాట్లాడుతున్నారు. చిలసౌ అన్నపూర్ణ సంస్థ నుంచి విడుదలైంది. అయినా సరే.. నాగ్ కూడా గూఢచారి వైపే ఉన్నాడు. ఈ సినిమాని మెచ్చుకుంటూ ట్వీట్ చేసిన నాగ్.. ఇప్పుడు సక్సెస్ మీట్‌కి కూడా హాజరవుతున్నాడు. ఈరోజు సాయింత్రం హైదరాబాద్‌లో ‘గూఢచారి’ సక్సెస్ మీట్ జరగబోతోంది. దీనికి నాగార్జున ముఖ్య అతిథిగా వస్తున్నాడు. తన సంస్థకు పోటీగా ఓ సినిమా వస్తే, దాన్ని మెచ్చుకోవడమే కాకుండా, ఇలా.. సక్సెస్ మీట్కీ రావడం… నాగ్ గొప్పదనానికి నిదర్శనం. ఓ రకంగా ‘గూఢచారి’కి నాగ్ రాయబారిగా మారిపోయినట్టే. మహేష్‌బాబుతో పాటు టాలీవుడ్ స్టార్లు, దర్శకులు ‘గూఢచారి’ని ఆకాశాన్ని ఎత్తేస్తున్నారు. ఇవన్నీ ఈ సినిమా ప్రమోషన్లకు బాగా సహకరిస్తున్నాయి. దాంతో సోమ, మంగళవారాల వసూళ్లు కూడా ఆశాజనకంగా సాగాయి.