వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి… వైఎస్ భారతి కూడా.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుకున్నారు. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్గా తాజాగా రఘురాం సిమెంట్స్ వ్యవహారంలో… అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి… ఆమెను ఐదో నిందితురాలిగా చేర్చారు. జగన్ అండ్ కో పై ఇప్పటి వరకూ.., ఈడీ పదకొండు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఒక్క దాంట్లోనూ భారతి పేరు లేదు. అనూహ్యంగా రఘురాం సిమెంట్స్ కేసులో.. ఐదో నిందితురాలిగా చేస్తూ.. ఇటీవల అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. మనీలాండరింగ్ చట్టం సెక్షన్ 3 కింద నేరానికి పాల్పడ్డారని.. సమన్లు జారీ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని సీబీఐ కోర్టును ఈడీ కోరింది.
రఘురాం సిమెంట్స్ అనే సంస్థను జగన్ చాలా తక్కువ ధరకు కొనుగులు చేసి.. దాన్ని భారతి సిమెంట్స్‌గా మార్చారు. ఆ సంస్థక క్విడ్ ప్రో కో రూపంలోకి వందల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పోటీ సిమెంట్ సంస్థలైన ఇండియా సిమెంట్స్ కూడా.. ఉత్పత్తిని ప్రారంభించికముందే.. పెద్ద మొత్తానికి చాలా తక్కువ షేర్లను కొనుగోలు చేసింది. ఆ తర్వతా పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించక ముందే.. కనీసం బ్రేక్ ఈవెన్ సాధించకముందే.. ఈ సంస్తలో 51 శాతం వాటను.. ఫ్రాన్స్‌కు చెందిన వికాట్ అనే సంస్థకు దాదాపుగా రూ. 2వేల కోట్లకు అమ్మేశారు. ఈ లావాదేవీలన్నింటిపైనా సీబీఐ విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి పలు చోట్ల సోదాలు నిర్వహించి 2013 సెప్టెంబర్‌లో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. దాని ఆధారంగా ఈడీ కూడా దర్యాప్తు చేపట్టి…అభియోగపత్రం దాఖలు చేసింది.
జగన్ కేసుల్లో ఇప్పటి వరకూ.. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకుని.. ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఇప్పటి వరకూ పలుమార్లు జగన్‌కు సమన్లు కూడా అందాయి. రఘురాం సిమెంట్స్ సంస్థను.. తన భార్య భారతి పేరుపైకి మార్చిన జగన్.. ఆమెను ప్రధాన వాటాదారుగా మార్చారు. ఇందువల్ల భారతి ఈడీ కేసుల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఆమె పేరుపై మనీలాండరింగ్ లావాదేవీలు జరిగినట్లు తేలడంతో ఈడీ చర్యలు తీసుకుంది. ఈడీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని సీబీఐ కోర్టు… వైఎస్ భారతికి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.
నిజానికి ఈడీ ఇలాంటి చర్యలు కొన్నాళ్ల క్రితం వరకూ దూకుడుగా తీసుకునేది. కానీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో.. జగన్ ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. ఆ సమయంలో… ఈడీ అధికారులపై నేరుగా ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. అప్పట్నుంచి.. బీజేపీతో, ప్రధానమంత్రితో వైసీపీ నేతలు .. ముఖ్యంగా సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి సన్నిహితంగా ఉంటున్నట్లుగా మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫోటోలు విడుదల చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల దర్యాప్తు సంస్థలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దానికి తగ్గట్లుగానే ఆ తర్వాత ఈడీ విచారణలో వేగం తగ్గింది. అనూహ్యంగా ఇప్పుడు.. భారతిని ఏ-5గా చేర్చారు.