తెలంగాణా మంత్రి వర్గంలో కేసీఆర్ తర్వాత కేటీఆరేనని అందరికీ తెలుసు. ఇప్పుడు కేటీఆర్ మరింత ముందుకు వెళ్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో ఆయన తన శాఖలకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు ఆయన కీలకమైన అన్ని శాఖలలోనూ… కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘాలను నియమిస్తుంది. ఈ ఉప సంఘం అందరితో చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక సబ్ కమిటీలన్నింటిలో కేటిఆర్ సభ్యుడిగా నియమిస్తున్నారు సిఎం కేీసీఆర్.గత రెండేళ్లలో పదికి పైగా సబ్ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.ప్రభుత్వానికి ఆర్టీసీ సంఘాలు ఢీ అంటే ఢీ అన్నాయి..ఈ సమయంలో మంత్రి కేటీఆర్ కీలక పాత్ర పోషించారు.కొన్ని విషయాలలో చొరవ తీసుకున్నారు. కేటీఆర్ ఒత్తిడి వల్లే సిఎం కేసీఆర్ పదహారు శాతం మధ్యంతర భృతికి అంగీకరించారని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన అంశాలపై కూడా ఆయనే నేరుగా డీల్ చేస్తున్నారు. చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్న రైస్ మిల్లు యాజమాన్యాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రైవేటు జూనియర్,డిగ్రీ,పాఠశాలల యాజమాన్యాలు అసంతృప్తితో ఉన్నాయి దీంతో ఆయన చొరవ తీసుకొని ఉప ముఖ్యమంత్రి కడియం,మంత్రి జగదీష్ రెడ్డి లతో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా తీసుకొని సమస్యలు పరిష్కరించడం. సబ్ కమిటీ సమావేశాలలో కీలక అంశాలపై చొరవ తీసుకుంటుండంతో కేటీఆర్‌ను యాక్టింగ్ చీఫ్ మినిస్టర్‌గా అందరూ పిలుస్తున్నారు.