వెంకటేష్, వరుణ్‌తేజ్‌లు కలసి ఓ సినిమాలో నటిస్తున్నారు. అదే.. `ఫన్ అండ్ ఫస్ట్రేషన్`. అనిల్‌రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. టైటిల్, కాంబినేషన్ అదిరిపోయాయి. మరి కథ ఎలా ఉండబోతోంది? ఈ విషయంలో ఓ క్లూ దొరికింది. ఇది భార్యా బాధితుల టైపు కథ అని తెలుస్తోంది. భర్తలు, వాళ్ల తీరుపై విసుగొచ్చిన ఇద్దరు భర్తలు.. ఫస్ట్రేషన్ ఎక్కువైపోయి, ఫన్ కోసం బ్యాంకాక్ వెళ్తారు. అక్కడ జరిగే పరిణామల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా `పెళ్లాం ఊరెళితే` గుర్తుంది కదా? ఈ సినిమా దానికి మరో కోణం. భార్యా భర్తల మధ్య చిలిపి తగాదాలు, వాళ్ల కోపతాపాలు, అనుమానాలు, రసహ్య రాసలీలలూ.. ఇవన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నార్ట. వెంకీకి పూర్తి స్థాయి వినోదాత్మక కథ దొరికి చాలాకాలమైంది. సో.. ఈసారి వెంకీ నుంచి కావాల్సిన వినోదాన్ని పిండుకోవొచ్చన్నమాట. తమన్నా,మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో వెంకీ, వరుణ్ తోడల్లుళ్లగా కనిపించబోతున్నారు.