నిశ్చితార్థమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం మన తెలుగు సినిమాల్లో వెంకటేష్‌కే సాధ్యం అనుకున్నాం. ఇప్పుడు రామ్ కూడా అలాంటి కథనే ఎంచుకున్నాడు. రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హలో గురూ ప్రేమ కోసమే’. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ‘నువ్వు నాకు నచ్చావ్’ గుర్తుంది కదా? నిశ్చితార్థమై, పెళ్లికి రెడీగా ఉన్న ఓ అమ్మాయి ఇంట్లో అడుగుపెడతాడు హీరో. ఆమెను ప్రేమించి ఎలా పెళ్లి చేసుకున్నాడన్నదే కథ. `హలో గురు` కూడా అలానే ఉంటుందట. అయితే ఇందులో పందెం అనే కాన్సెప్ట్ కూడా జోడించార్ట. హీరోయిన్ తండ్రితో వేసిన పందెం కోసమే.. హీరోయిన్ని ప్రేమలో దించడానికి ప్రయత్నిస్తాడట హీరో. అందులో ఎలా సఫలీకృతమయ్యాడు? అనేదే కథ. ఈ తరహా కథలు తెలుగు తెరకు మామూలే. అయితే.. ఎంత కొత్తగా తెరకెక్కించారన్నదే ప్రధానం. సినిమా చూపిస్త మావ, ఎంసీఏతో ఆకట్టుకున్న త్రినాధరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీని ఆయన బాగానే వర్కవుట్ చేస్తారు. ఇందులో వినోదం పండితే… పాత కథైనా పాసైపోయే ఛాన్సుంది.