భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు… షార్ట్ కట్ లో సూపర్ పబ్లిసిట ఎలా పొందాలా అనే దాంట్లో మంచి పరిశోధన చేసినట్లు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీడీ అకౌంట్లు భారీ తెరిచిందని.. అందులో వేల కోట్ల ఆస్తులున్నాయని ఆరోపణలు చేశారు. పీడీ అంటే.. పర్సనల్ డిపాజిట్ అకౌంట్లు కావడంతో.. అవేవో టీడీపీ కార్యకర్తల అకౌంట్లు అన్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. జీవీఎల్ చేసిన ఆరోపణలు… వరుసగా టీడీపీ నేతలంతా కౌంటర్ ఇచ్చారు. చివరికి నిన్నటికి నిన్న ఏపీ ప్రభుత్వ ఆర్థిక శాఖ ఉన్నతాధికారి రవిచంద్ర.. పీడీ అకౌంట్ల స్పష్టమైన వివరణ ఇచ్చారు. పీడీ అంటే పర్సనల్ డిపాజిట్ అకౌంట్లు కాదని.. ప్రభుత్వ ఖాతాలేనని స్పష్టం చేశారు. ప్రస్తతం పీడీ అకౌంట్లలో రూ. 10 వేల కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీడీ అకౌంట్లు నిర్వహిస్తున్న తీరు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని కూడా చెప్పుకొచ్చారు.
అటు టీడీపీ నేతలు చేసిన సవాళ్లకు కానీ.. ఇటు ప్రబుత్వ ఉన్నతాధికారి ఇచ్చిన వివరణపై కానీ.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించలేదు. కానీ ఇవాళ నేరుగా గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పీడీ అకౌంట్స్‌లో భారీగా నగదు జమ చేయడంపై…కాగ్ స్పెషల్ ఆడిట్, సీబీఐ విచారణకు ఆదేశించాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఏపీ పీడీ అకౌంట్స్‌లో స్కామ్ జరిగిందని లేఖలో ఆరోపించారు. రూ.53,038కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం పీడీ అకౌంట్స్‌లో వేసిందని కూడా లెక్కలు చెప్పారు. 2016-17 కాగ్ రిపోర్ట్ చూస్తే ఇదో భారీ కుంభకోణం అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంటే అన్న విమర్శలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. జీవీఎల్ తన దగ్గర ఆధారాలు ఉంటే… కోర్టుకైనా వెళ్లొచ్చు లేదా.. ఇతర మార్గాలు ఉంటాయి
కానీ.. గవర్నర్ కు లేఖ రాయడమేమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గవర్నర్ కు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అధికారులు ఉండవని తెలిసి కూడా… జీవీఎల్ లేఖ రాసి.. మీడియా ఎదుట పబ్లిసిటీ చేసుకుంటున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ జీవీఎల్ మాత్రం ఈ విషయంలో తనకు … ఏపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందో లేదో.. నిర్ధారణ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఏదో జరిగిందని ప్రజల్లోకి వెళ్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు ఆధారాలు చూపించినా రాజీనామా చేస్తాని.. ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యకుడు.. కుటుంబరావు పదే పదే సవాల్ చేసినా జీవీఎల్ స్పందించలేదు. కానీ ఆరోపణలు మాత్రం కొనసాగిస్తున్నారు.