శ్రీమంతుడులో లక్షల కోట్లకు అధిపతిగా కనిపించాడు మహేష్‌బాబు. అపర కోటీశ్వరుడు కాబట్టి.. మహేష్‌ని చాలా స్టైలీష్‌గా చూపించే అవకాశం దక్కింది. భరత్ అనే నేనులో కూడా అంతే. ఆయన ఓ రాష్ట్రానికే సీఎం. ఇప్పుడు `మహర్షి`లోనూ మిలీయనిరే. కోట్లలో మునిగి తేలిన రుషి… మహర్షిగా ఎలా మారాడన్నదే కథ. సెకండాఫ్ మొత్తం ఓ ఎమోషనల్ జర్నీ నడుస్తుందట. మనీ, మనిషి, మానవత్వం, స్నేహం… వీటికి సంబంధించిన సన్నివేశాలు, డైలాగులతో హృదయాన్ని హత్తుకునే ప్రయత్నం చేస్తున్నార్ట. అయితే తొలి భాగం మాత్రం సరదాగా సాగిపోతోందని, ముఖ్యంగా కాలేజీ సన్నివేశాలు హాయిగా నవ్విస్తాయని తెలుస్తోంది. ఈ కాలేజీ ఎపిసోడ్‌లోనే అల్లరి నరేష్ కనిపిస్తాడట. తనతో స్నేహం, పూజాతో ప్రేమ… ఈ వ్యవహారాలన్నీ కాలేజీ ఎపిసోడ్లుగా వస్తాయట. శ్రీమంతుడైన రుషి నాన్న మాటలకు ప్రభావితుడై.. ఎలా మారాడు? ఏం సాధించాడన్నది చాలా హృద్యంగా చూపించబోతున్నారని తెలుస్తోంది. శ్రీమంతుడులో కూడా మహేష్ కాలేజీ విద్యార్థిగా కనిపించాడు. వాటికి కేవలం లవ్ యాంగిల్ కోసం వాడుకున్నారు. ఈసారి మాత్రం కామెడీ నీ మిక్స్ చేశారు. ‘మహర్షి’ టైటిల్ పట్ల పట్ల మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు. మూడక్షరాల టైటిళ్లు మహేష్‌కి బాగానే కలిసొచ్చాయి. ఆ సెంటిమెంట్ వారిని మరింత ఊరిస్తోంది.