పీడీ అకౌంట్స్‌పై సీబీఐ విచారణ చేయించాలంటూ… బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గవర్నర్‌కు లేఖ రాశారు. అసలు పీడీ అకౌంట్లలో తప్పేముందని.. తెలుగుదేశం పార్టీ అంటోంది. అసలు ఈ విషయం అర్థం కావాలంటే.. మొదటి రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియాల్సి ఉంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏమిటంటే.. శాసనసభలో బడ్జెట్ ఆమోదించకుండా… ప్రభుత్వ నయాపైసా ఖర్చు పెట్టకూడదు. బడ్జెట్ ఆమోదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి బడ్జెట్లో ఆమోదించిన నిధులను విత్ డ్రా చేసుకోవచ్చు.
ప్రభుత్వం డబ్బులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోఉంటాయి. అలాగే ఎమర్జెన్సీ అయితే ఉపయోగించుకోవడానికి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో కూడా డబ్బులు పెడతారు. కేంద్రం కేంద్ర పరిధిలో, రాష్ట్రం రాష్ట్ర పరిధిలో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాను కలిగి ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చే అన్ని రకాల ఆదాయాలు ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ లో చేరుస్తారు. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, రుణాలు తీసుకున్న నిధులు కూడా ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ లోకే వస్తాయి. ఇవే కాకుండా ప్రభుత్వానికి వచ్చే ఎలాంటి ఆదాయాలైనా ఈ ఫండ్ లోకే చేరుతాయి. ప్రభుత్వ ఎప్పటికప్పుడు తన ఖర్చుల కోసం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే డ్రా చేసుకుంటూ ఉండాలి, ఏ శాఖ అయినా… తమకు నిధులు కావాలంటే బిల్లు ట్రెజరీకి సబ్మిట్ చేస్తారు. ఆ ట్రెజరీ నిధులు మంజూరు చేస్తూ ఉంటుంది. ఇది సహజంగా జరుగుతుంది. దీనికి రెండు పద్దతులు ఉంటాయి. ఒకటి డైరక్టర్ ఆఫ్ ట్రెజరీ ఎకౌంట్. డైరక్టర్ ఆఫ్ వర్క్స్ ఎకౌంట్. డైరక్టర్ ఆఫ్ వర్క్స్ ఎకౌంట్లో ఆయా శాఖల బిల్లులు విత్ డ్రా చేసుకుంటారు. జీతాలు, నిర్వహణల లాంటివి డైరక్టర్ ఆఫ్ ట్రెజరీ ఎకౌంట్ నుంచి విత్ డ్రా చేసుకుంటారు.
పీడీ అకౌంట్లు వ్యక్తిగత అకౌంట్లు కాదు..!
ఇలా వివిధ ప్రభుత్వ శాఖలు బడ్జెట్లో తమకు కేటాయించిన నిధులను.. వివిధ పనుల కోసం డ్రా చేసుకోవాలనుకున్న సమయంలో తమకు కావాల్సిన నిధులను డైరక్టర్ ఆఫ్ ట్రెజరీ ఎకౌంట్. డైరక్టర్ ఆఫ్ వర్క్స్ ఎకౌంట్ నుంచి డ్రా చేసుకుంటాయి. ఆయా శాఖలు బిల్లులు పెట్టినప్పుడు ముందుగా ప్రి ఆడిట్ జరుగుతుంది. ఆ తర్వాత స్క్రూటినైజ్ చేస్తారు. ఇదంతా అయిన తర్వాతనే బిల్లు పాస్ చేస్తారు. ఇది కామన్ ప్రొసీజర్. ఓశాఖకు రూ. 200 కోట్లు కేటాయించారనుకుందాం. ఆ రెండు వందల కోట్లు మాత్రమే…ఆ శాఖ వాడుకుంటుంది. అవసరం వచ్చినప్పుడల్లా ట్రెజరీకి బిల్లులు సమర్పించి.. కావాల్సిన నిధులు తీసుకోవాలంటే ఆలస్యం అవుతుంది కాబట్టి.. తమకు బడ్జెట్లో కేటాయించిన నిధులను ఒకేసారి పెత్త మొత్తంలో విత్ డ్రా చేసుకుంటారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో విత్ డ్రా చేసుకుంటారు. వాటిని పీడీ అకౌంట్లలో ఉంచుకుంటారు.
అన్ని రాష్ట్రాల్లోనూ పీడీ అకౌంట్లు ఉన్నాయి..!
ఈ పీడీ అకౌంట్లు వ్యక్తిగత అకౌంట్లు కాదు. వివిధ రకాల ప్రభుత్వ విభాగాల అధిపతుల పేరిట ఈ పీడీ అకౌంట్లు ఉంటాయి. అందుకే దీన్ని పర్సనల్ డిపాజిట్ అకౌంట్ అంటారు. పీజీ అకౌంట్ అంటే.. వ్యక్తి పేరు మీద ఉండదు. డైరక్టర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియర్ ఎడ్యుకేషన్ , డైరక్టర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. ఇలాంటి పేర్ల మీద ఉంటుంది. ఒకసారి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఒక్క సారి విత్ డ్రా అయితే.. ఆ మొత్తం ఖర్చు అయినట్లే లెక్క. ఇక్కడ నిధులు ఎలా ఉంటాయంటే… మార్చి 31లోపు ఖర్చు పెట్టకపోతే.. అవి ముగిరిపోతాయి. అదే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి విత్ డ్రా చేసి.. పీడీ అకౌంట్లలో పెట్టుకుంటే అవి లాస్ కావు. మురిగిపోవు. ఈ పీడీ అకౌంట్లు సహజమైన ప్రక్రియ. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు.. అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలంగాణలో కూడా… 28వేలకు పైగా పీడీ అకౌంట్లు ఉన్నాయని కాగ్ నివేదిక తెలిపింది. రూ. 10,800 కోట్ల నిధులు తెలంగాణ పీడీ అకౌంట్లలో కూడా ఉన్నాయి. కానీ బీజేపీ తెలంగాణలో ఉన్న పీడీ అకౌంట్లపై మాట్లాడదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పీడీ అకౌంట్లపైన మాత్రమే మాట్లాడుతుంది.
ఎక్కువ పీడీ అకౌంట్లు ఎందుకు ఉన్నాయో ప్రశ్నించాలి..!
పీడీ అకౌంట్లు ఈ వ్యవహారం సర్వామోదం. ఫైనాన్షియల్ కోడ్ కూడా అనుమతిస్తుంది. పీడీ అకౌంట్ల విషయంలో తెలుగుదేశాన్ని ప్రశ్నించాల్సింది వేరే. ఇతర రాష్ట్రాల్లో వందల సంఖ్యలో పీడీ అకౌంట్లు ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో వేల సంఖ్యలో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో తక్కువ మొత్తాలు పీడీ అకౌంట్లలో క్రెడిట్ అయితే.. ఏపీలో మాత్రం చాలా పెద్ద మొత్తంలో క్రెడిట్ అయ్యాయి. అడగాల్సింది సీబీఐ విచారణ కాదు. ఇన్ని వేల పీడీ ఎకౌంట్లు ఎందుకు పెటాల్సి వచ్చిందని అడగాలి..? గ్రామ పంచాయతీలకూ పీడీ అకౌంట్లు ఉన్నాయి. స్థానిక సంస్థల పీడీ అకౌంట్లు తీసేసినా కూడా పది వేల పీడీ అకౌంట్లు ఉన్నాయి. ఇన్ని వేల అకౌంట్లు ఏ రాష్ట్రంలో లేనన్ని.. మీ రాష్ట్రంలో ఎందుకు ఉన్నాయని అడగాలి..? పీ బడ్జెట్ రూ.1 లక్షా 30 వేల కోట్లు. ఇందులో అరవై వేల కోట్లు.. జీతాలు ఇతర ఖర్చులకు పోతుంది. మిగతా 70వేల కోట్లలో అరవై శాతం పీడీ అకౌంట్లలోనే పెట్టారు. ఇలా చేయడం అనూహ్యం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రకారం కరెక్ట్ కాదు. పీడీ అకౌంట్లు తప్పు కాదు. అందులో నిధులు పెట్టుకోవడం కూడా తప్పు కాదు. కానీ ఇంత పెద్దలో ఎందుకు పీడీ అకౌంట్లలో నిధులు ఉంచారన్న ప్రశ్ననే టీడీపీ ప్రభుత్వానికి వేయాలి. దీనికి తెలుగుదేశం ప్రభుత్వం తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే.. ఈ పీడీ అకౌంట్స్ లోకి నిధులు విత్ డ్రా చేయాలంటే.. కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని అనురరిచారా..? లేదా అన్నది అడగాలి.