2018లో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ‘మహానటి’ ఒకటి. వసూళ్ల పరంగా, విమర్శకుల పరంగానూ `మహానటి` గుర్తుండిపోతుంది. తెలుగులో బయోపిక్‌ల పరంపరకు నాంది పలికింది. ఇప్పుడు అవార్డుల పరంపరకు శ్రీకారం చుట్టింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ కు ఎంపికైన మహానటి అక్కడ ఈక్వెలిటి ఇన్ సినిమా అవార్డ్ సొంతం చేసుకుంది. దర్శకుడు నాగ్ అశ్విన్, కీర్తిసురేష్.. నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్ ఆ వేడుకకు హాజరై అవార్డును అందుకున్నారు. అవార్డ్ వేడుక తర్వాత ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకులు రాజీవ్ మసంద్ తో ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది మహానటి యూనిట్. ఈ యేడాది వివిధ దేశాల్లో జరగబోతున్న చిత్రోత్సవాలల్లో మహానటికి ఎంట్రీలు దక్కాయి. మరి అక్కడ ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.