వరదలతో అతలాకుతలమవుతున్న కేరళను ఆదుకోవడానికి సినిమా రంగం నడుం కట్టింది. సూర్య, కార్తి సోదరులు రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి తమ సేవా దృక్పథాన్ని చాటారు. విజయ్ దేవరకొండ తన వంతు సాయంగా రూ.5 లక్షలు అందించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. కేరళ బాధితులకు బాసటగా నిలిచిన అల్లు అర్జున్ … వరద సాయంగా రూ.25 లక్షల్ని ప్రకటించాడు. కేరళలో అల్లు అర్జున్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. అక్కడ మల్లూస్టార్గా ఎదిగాడు. బన్నీ ఫ్లాప్ సినిమాలు కూడా మలయాళంలో డబ్ అయి.. భారీ వసూళ్లు సాధించిన సందర్భాలున్నాయి. మలయాళంలో నేరుగా ఓసినిమా చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. అందుకు తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడివాళ్లని ఆదుకోవడం తన తక్షణ కర్తవ్యంగా భావించాడు బన్నీ. ఈరోజు ఉదయం… వరద బాధితులకు సంతాపంగా ఓ ట్వీట్ చేసిన బన్నీ.. ఇప్పుడు ఆర్థిక సహాయం అందించి మరో అడుగు వేశాడు.