‘అరవింద సమేత.. వీరరాఘవ’ టీజర్ ఈరోజు విడుదలైంది. 52 సెకన్ల వీడియోలో ఎన్టీఆరే ఎక్కువ కనిపించాడు. కాదు.. కాదు.. మిగతా నటీనటులకు దర్శకుడు త్రివిక్రమ్ చోటు ఇవ్వలేదు. కానీ, స్నేహితుడు సునీల్‌ని చిన్నగా చూపించాడు. టీజర్లో ఎన్టీఆర్ యాక్షన్‌కి జగపతి బాబు వాయిస్ ఓవర్ తోడు కావడంతో హీరోయిజం ఆకాశాన్ని తాకింది. అందరూ ఎన్టీఆర్‌నే చూశారు. త్రివిక్రమ్ కూడా యంగ్ టైగర్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. అయితే… ఈ టీజర్లో సునీల్ కూడా వున్నాడని ఎంతమందికి తెలుసు? ‘కంటబడ్డావా… కనికరిస్తానేమో! యెంటబడ్డానా… నరికేస్తావొబా’ అని ఎన్టీఆర్ డైలాగ్ చెప్పడానికి ముందు కుర్చీ గాల్లోకి లేచిన సమయంలో జాగ్రత్తగా గమనిస్తే సునీల్ కనిపిస్తాడు. ఇటీవల కాలంలో సునీల్ హీరోగా నటించిన ప్రతి సినిమా పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో మళ్లీ హాస్య నటుడిగా మారాలనుకున్న సునీల్‌కి త్రివిక్రమే తొలి అవకాశం ఇచ్చాడు. ‘అరవింద సమేత వీరరాఘవ’ సెట్స్ మీదకు వెళ్లడం ఆలస్యం అయ్యిందేమో కానీ… అందులో సునీల్‌కి ఎప్పుడో వేషం వచ్చేసింది. స్నేహితుడికి కీలక పాత్ర ఇవ్వడమే కాకుండా… టీజర్లో అతణ్ణి చూపించారు త్రివిక్రమ్. ఓ రకంగా సునీల్‌కి హాస్య నటుడిగా ఈ సినిమా గ్రాండ్ రీఎంట్రీ అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ రచన, సునీల్ నటన సూపర్‌హిట్ కాంబినేషన్. గతంలో వీళ్ల కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాల్లో ప్రేక్షకులను నవ్వించినవి ఎన్నో! ఈ సినిమాలో సునీల్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి సన్నివేశాలు రాశాడో?