క్రీడా నేపథ్యంలో బాలీవుడ్లో సినిమాలొస్తున్నాయి. టాలీవుడ్ మాత్రం ఆ దిశగా ఇంకా అడుగులు వేయలేకపోతోంది. అప్పుడప్పుడూ మన కథానాయకులు క్రీడాకారులుగా కనిపిస్తున్నా.. కథ మాత్రం పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నడవడం లేదు. `గురు` తరవాత తెలుగులో స్పోర్ట్స్ డ్రామా ఏదీ రాలేదు. గోపీచంద్ జీవిత కథని సినిమాగా తీస్తామన్నారు గానీ, అందుకు సంబంధించి ఒక్క అడుగు కూడా పడలేదు. ఇప్పుడు విజయ్‌దేవరకొండ నటిస్తున్న `డియర్ కామ్రేడ్` కూడా ఓ స్పోర్ట్స్ డ్రామానేనట. ఇందులో కథానాయిక రష్మిక క్రికెటర్‌గా కనిపించబోతోందట. మరి విజయ్ కూడా క్రికెటర్ అవతారం ఎత్తుతాడా, లేదా? అనేది తేలాల్సివుంది. `డియర్ కామ్రేడ్` అనగానే ఇదేదో అభ్యుదయ సినిమా అనుకుంటారు. కానీ.. దానికి క్రికెట్ నేపథ్యం జోడించారు. ఈ సినిమా కోసం కథానాయిక రష్మిక క్రికెట్ కోచింగ్ తీసుకొంటోందట. విజయ్ దేవరకొండకు చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ఇష్టం. ఆ లెక్కన తనకు ఎలాంటి ప్రాక్టీసూ అవసరం లేదు.