రవిబాబు అప్పుడెప్పుడో `అదిగో` అంటూ ఓ సినిమా మొదలెట్టాడు. పంది పిల్లని చంకలో పెట్టుకుని రెండు మూడు స్టిల్స్ వదిలాడు. ఆ సినిమా పూర్తయినా.. ఇంకా బయటకు రాలేదు. జంతువుల్ని సినిమాలో వాడితే.. సెన్సార్ సర్టిఫికెట్ రావడం కష్టం. అందుకే పందికి సంబంధించిన సన్నివేశాలన్నీ సీజీలో చేయాల్సివచ్చింది. దానికే చాలా సమయం పట్టేసింది. ఆ గ్రాఫిక్స్ ఇప్పుడు పూర్తయ్యాయి. అందుకే ఇప్పుడు ఈ సినిమాని విడుదల చేయడానికి నిర్మాత సురేష్ బాబు రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెలలో ‘అదిగో’ విడుదల అయ్యే ఛాన్సులున్నాయి. ఇప్పటి వరకూ సీజీ వర్కుల్లో తలమునకలయ్యారని, అవన్నీ ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయని టాక్. ఇటీవల సురేష్‌బాబు ‘అదిగో’ సినిమా చూసుకుని సంతృప్తి వ్యక్తం చేశాడట. సినిమా చూసి, అనుమానాలొచ్చిన చోట రీషూట్లు పెట్టి, రీ ఎడిటింగులు చేయడం సురేష్ బాబు అలవాట. అయితే.. ‘అదిగో’ అన్ని విధాలా సంతృప్తి నివ్వడంతో రిలీజ్ కి పచ్చజెండా ఊపేశాడట. ఈవారంలోనే ప్రమోషన్లు మొదలెట్టి, రిలీజ్ డేట్ ప్రకటించాలని చూస్తున్నాడు సురేష్‌బాబు.