‘అర్జున్ రెడ్డి’… ఈ సినిమాని ఇప్పట్లో తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. తెలుగు సినిమా ట్రెండ్‌కి ఓ కొత్త ఊపు ఇచ్చింది అర్జున్ రెడ్డి. అందుకే మిగిలిన భాషల్లోనూ రీమేక్ అవుతోంది. బాలీవుడ్‌కీ వెళ్తోంది. ఈసినిమాతోనే విజయ్ దేవరకొండ స్టార్ అయ్యాడు. సందీప్ రెడ్డి వంగా క్రేజ్ పెరిగింది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ వర్కవుట్ కాబోతోంది. ఈమధ్య ఇద్దరూ కలసి మాట్లాడుకున్నార్ట. `మరో సినిమా చేద్దాం` అనుకున్నార్ట. విజయ్ చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. సందీప్ కూడా బాలీవుడ్లో ‘అర్జున్ రెడ్డి’ పూర్తి చేయాలి. అదయ్యాకే… విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తాడట. దీనికి సందీప్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. సందీప్ దగ్గర ‘షుగర్ ఫ్యాక్టరీ’ అనే ఓ స్క్రిప్టు ఉంది. ‘అర్జున్ రెడ్డి’కంటే ముందు అదే చేద్దామనుకున్నాడు. ఆ కథనే… విజయ్‌తో తీస్తాడా, లేదంటే.. మరో కథ ఏమైనా తయారు చేశాడా? అనేది తేలాల్సివుంది.