గాడ్స్ ఓన్ కంట్రీపై ప్రతాపం చూపిస్తున్న ప్రకృతి ఇప్పుడు… అక్కడి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. సర్వం కోల్పోయిన వాళ్లు లక్షల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళను ఆదుకోవడానికి…. దేశ,విదేశాల నుంచి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఎవరికి తోచినంత సాయం వారు చేస్తున్నారు ఎంత సాయం చేసినా.. చేసినట్లే. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనంత దౌర్భాగ్యం మన ఇండియాలోనే ఉంటుంది. అదే… వాళ్లు ఎంత విరాళం.. ఇచ్చారో.. వాళ్ల పోటీ దారులతోనే..మరొకరితోనే పోల్చి… తక్కువగా ఇచ్చారని కించ పరచడం. మిగతా చోట్ల సంగతేమో కానీ… రాజకీయాలు వికృత స్థాయికి చేరిన దక్షిణాదితో పాటు ఏపీలో మాత్రం ఇది చాలా తీవ్ర స్థాయిలో ఉంది.
కేరళకు తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్ల రూపాయలు ఇచ్చింది. అందరూ కేసీఆర్ ను అభినందించారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం .. రూ. 10 కోట్లు ప్రకటించింది. దాంతో బుద్దిలో కురచగా ఉండి… ప్రముఖులుగా చెలామణి అయ్యే కొంత మంది వ్యక్తులు కూడా… చంద్రబాబు వెనుకబడిపోయారంటూ వెటకారాలు చేయడం ప్రారంభించారు. ఎవరి పరిధుల్లో వారు సాయం చేస్తారు.. దాని ఇతరులతో పోల్చడం ఎందుకో … సాయం చేసిన వారిని కించ పరచడం ఎందుకో ఎవరికీ అర్థం కాదు. ఇదే కాదు.. ఇక వరుసగా… కేరళకు ఎవరు ఏ సాయం చేశారు.. ఎంత స్పందించారన్నదానిపై.. సోషల్ మీడియాలో … విమర్శలు, ట్రోలింగ్ ప్రారంభించారు. చిరంజీవి ఫ్యామిలీ ప్రకటించిన సాయంపైనా.. అదే తరహా కామెంట్లు చేస్తున్నారు.
ఇక తమిళనాడులో హీరో విజయ్ రూ. 14 కోట్లు ఇచ్చారంటూ… ఒక్కసారిగా సోషల్ మీడియాలో గుప్పుమంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక వార్తేమీ బయటకు రాలేదు. అదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రూ. 15 లక్షలు ప్రకటించినట్లు అధికారిక వార్త వచ్చింది. దాంతో.. ఒక్కసారి అందరికీ రజనీకాంత్ టార్గెట్ అయిపోయారు. ఆయన కన్నా చిన్న స్టార్లు … అంతకన్నా పెద్ద మొత్తమే ఇచ్చారని… రజనీ మాత్రం చాలా చిన్న మొత్తం ఇచ్చారని ట్రోలింగ్లు ప్రారంభించారు. గతంలోనూ రజనీకాంత్.. ఇలా చాలా చిన్న మొత్తం విరాళాలు ప్రకటించారు. అప్పుడూ కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. విశాఖ హుదూద్ సమయంలో చాలా ఆలస్యం… చాలా చిన్నమొత్తం ప్రకటించారు. అప్పుడూ నెటిజన్లు సెటైర్లు వేశారు.
అయితే ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవే. రాజకీయాలకు సంబంధం లేని.. సినీ తారలు ఎంత ఇచ్చినా… ఎవరూ పట్టించుకోరు. మహా అయితే ఆయా హీరోల అభిమానులు తమ హీరో కోసం పోస్టులు పెడతారు. కానీ… ఇతరులను ట్రోలింగ్ చేయరు. రాజకీయాల్లోకి వచ్చిన హీరోలకు మాత్రం… విరాళం ఇచ్చినా.. ఇవ్వకపోయి.నా.. ఎక్కువిచ్చినా… తక్కువిచ్చినా విమర్శలు ఎదుర్కోకతప్పదని తాజా పరిస్థితి నిరూపిస్తోంది.