ఈ దసరాకి ఎన్టీఆర్ `అరవింద సమేత వీర రాఘవ`తో వినోదాలు పంచడానికి సిద్ధమవుతున్నాడు. దసరా బరిలోనే `అమర్ అక్బర్ ఆంటోనీ`, `హలో గురు ప్రేమ కోసమే` సినిమాలూ ఉన్నాయి. ఎన్టీఆర్కి భయపడి కొన్ని సినిమాలు వాయిదా పడే ఛాన్సుంది. అయితే… ఓ పంది పిల్ల మాత్రం కయ్యానికి కాలు దువ్వుతోంది. అదేనండీ… రవిబాబు సినిమా `అదిగో` ఉంది కదా? అందులో పంది పిల్లే హీరో. ఆ సినిమా కూడా ఇప్పుడు దసరా బరిలో నిలిచింది. ఈ సినిమాని దసరాకే విడుదల చేయాలని నిర్మాత సురేష్ బాబు భావిస్తున్నారు. ఎప్పుడో మూడేళ్ల క్రితం మొదలైన సినిమా ఇది. గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు అవన్నీ పూర్తయ్యాయి. దాంతో విడుదల తేదీ ఫిక్స్ చేసే పనిలో పడింది చిత్రబృందం. ఈ సినిమాని దసరాకే విడుదల చేయాలని సురేష్ బాబు భావిస్తున్నారు. బరిలో పెద్ద సినిమాలున్నా, సురేష్ బాబు చేతిలో థియేటర్లు ఉన్నాయి కాబట్టి.. ఆ సమస్య ఈ చిన్న సినిమాకి ఉండకపోవొచ్చు.