బీచ్ గీతాలు, రొమాంటిక్ పాటలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. కానీ సరిగా తీయడం రావాలంతే. ఈ పాటలు తీయడంలో ఆరితేరిపోయాడు కృష్ణవంశీ. ఆయన తరవాత ఆ స్థాయిలో బీచ్ గీతాల్ని తెరపై చూపించలేకపోయారు దర్శకులు. ఇప్పుడు ఆయన శిష్యుడు శ్రీనివాస చక్రవర్తి అలాంటి ప్రయత్నం చేశాడు. శ్రీనివాస చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం `@ నర్తనశాల`. ఇప్పటి వరకూ వచ్చిన పాటలు హాయిగా, పొయెటిక్‌గా ఉన్నాయి. ఇప్పుడు విడుదల చేసిన `పిచ్చిపిచ్చిగా నచ్చావురా మనోహరా` పాట మాత్రం మంచి రొమాంటిక్ నెంబర్. తెరకెక్కించిన తీరు కూడా అలానే ఉంది. కళ్లజోడు పెట్టుకున్న నాగశౌర్య బుద్దిమంతుడిలా కనిపిస్తుంటే.. తడి బట్టలతో యామిని.. చాలా హాట్ హాట్‌గా కనిపిస్తోంది. ఈ తరహా పాటలు తీయడంలో కృష్ణవంశీకి ఓ స్టైల్ ఉంటుంది. దాన్ని… శిష్యుడు అచ్చుగుద్దినట్టు దింపేసినట్టు అనిపించింది. లిప్సిక పాడిన ఈ పాటని ధరమ్ తేజ్ రాశారు. తీత, రాత రెండూ హీటెక్కించేవే. రొమాంటిక్ సీన్లు, ముద్దు సీన్లు అంటే.. యూత్ బారులు తీరుతున్న ఈ సందర్భంలో `@నర్తనశాల`కీ అది ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సుంది. ఈనెల 30న నర్తల శాల విడుదలకు సిద్ధమైంది. మరి ఈ పాట థియేటర్లో ఎంత హీటెక్కిస్తుందో చూడాలి.