జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసుకున్న పెళ్ళిళ్లపై వైసీపీ అధినేత జగన్ కొద్ది రోజుల కిందట వ్యక్తిగత విమర్శలు చేశారు. ఐదు వేళ్లు చూపించి… నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని.. కార్లు మార్చినట్లు పెళ్లాలని మార్చేస్తారని మండి పడ్డారు. దాంతో ఆయనకు… ఎక్కడ లేని పబ్లిసిటీ వచ్చింది. పవన్ కల్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ అయిందేమో కానీ.. జగన్ మాటలపై విస్తృతమైన చర్చ జరిగింది. జగన్ మాటలు ఆన్ లైన్లో వైరల్ అయ్యారు. ఆ తర్వాత జగన్ కుటుంబ సభ్యుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి.. జనసేన శతఘ్ని గుండ్లు కురిపించింది.. అది వేరే విషయం. ఇదేదో బాగుందనుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి ఈ సారి చంద్రబాబుపై పెళ్లిళ్ల విమర్శలు ఎక్కు పెట్టారు.
విశాఖ జిల్లా కోటరవుట్లలో పాదయాత్ర చేసిన జగన్… అక్కడ బహిరంగసభలో చంద్రబాబు ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారని… విమర్శించారు. అయితే ఈ పెళ్లిళ్లు పవన్ కల్యాణ్ తరహా పెళ్లిళ్లు కాదట. రాజకీయ పార్టీలతో చేసుకున్న పెళ్ళిళ్లట. ఇప్పటికే ఐదు పార్టీలను పెళ్లి చేసుకుని వదిలేసి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారట. బీజేపీ, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, జనసేనలను పెళ్లి చేసుకుని వదిలేశారట. ఎప్పుడూ చేసే రొటీన్ విమర్శలను… చేస్తూ.. అప్పుడప్పుడూ… జగన్ ఇలాంటి విమర్శలు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నారని.. టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ… ఎప్పుడు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నా.. రాష్ట్ర ప్రయోజనాలే చూసుకుంది కానీ.. రాజకీయ ప్రయోజనాలు కాదని… టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్ వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల మాఫీ కోసం నేరుగా పొత్తు పెట్టుకోకుండా.. లోపాయికారీ వ్యవహారాలు నడపడం టీడీపీ వల్ల కాదని చెబుతున్నారు. పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం…. పెళ్లి అయితే.. ఇప్పడు వైసీపీ పొత్తులు పెట్టుకోకుండా… బీజేపీ కోసం చేస్తున్నదేమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు… జాతీయ పార్టీలు రెండింటింకి… టీడీపీతో లింక్ పెట్టాలనే ప్రయత్నంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కానీ రెండింటితో టీడీపీకి లింక్ పెడితే.. ప్రజలు నమ్మరని గుర్తించలేకపోతున్నారు.