“ఐ డోంట్ ఫీల్ సెక్యూర్ ఇన్ తెలంగాణ (నేను తెలంగాణలో సురక్షితంగా ఉండలేను). ఆ జంతువుల మధ్య నేను బతకలేను” – ఇదీ శ్రీరెడ్డి తాజా స్టేట్మెంట్!
తెలుగు సినిమా ప్రముఖులపై ఆరోపణలు చేయడం తప్ప, ఇప్పటివరకూ ఒక్కర్నీ దోషిగా ప్రజల ముందు నిలబెట్టే ఆధారాలను శ్రీరెడ్డి చూపలేదు. కానీ, ఆమెకు పలువురి నుంచి మద్దతు లభించింది. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాక మద్దతు తగ్గింది. ఎవరూ ఆమెను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలు అందర్నీ జంతువులు కింద అభివర్ణించి అవమానించడం శ్రీరెడ్డికి తగునా?? ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి తమిళనాడు రాజధాని చెన్నైకి షిఫ్ట్ అయ్యింది శ్రీరెడ్డి. ‘రెడ్డి డైరీ’ అనే తమిళ సినిమాలో ఈమెకు అవకాశం వచ్చింది. అలాగే. మరో రెండు సినిమాలు చర్చల దశలో వున్నాయని సమాచారం. అందుకని మకాం చెన్నైకి మార్చేసింది. పనిలో పనిగా సింపతీ కోసం తెలుగు ప్రజల మీద తిడుతూ, తమిళ ప్రజలను తెగ పొగిడింది.
“నేను ఏడ్చినప్పుడు… తమిళ ప్రజలు ఏడ్చారు. నా సమస్యను అర్థం చేసుకున్నారు. కష్టాల్లో వున్నప్పుడు మద్దతు ఇస్తామని చెప్పారు. అందుకే, చెన్నైలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని సిటీలో సెటిల్ అవుదామని అనుకుంటున్నాను” అని తమిళనాట తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు అర్థం ఏమిటి!? తెలుగులో శ్రీరెడ్డికి ఎవరూ మద్దతు ఇవ్వలేదా? ఎంతమంది ఆమెకు మద్దతు ఇచ్చారో.. టీవీల్లో చర్చలు చూసిన ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఈ విధంగా శ్రీరెడ్డి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎంత వరకూ సబబు? ఇంకా శ్రీరెడ్డి మాట్లాడుతూ “సురేష్ బాబు, చిరంజీవి వంటి కొన్ని కుటుంబాల చెప్పు చేతల్లో తెలుగు చిత్ర పరిశ్రమ వుంది. వాళ్లే ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో నాకు న్యాయం జరగదని తెలుసు. వాళ్ళు నా సమస్యను టేకప్ చేసి, నాకు మద్దతు ఇవ్వాలనుకోవడం లేదు. ఒకానొక సమయంలో నా మీద నిషేధం విధించారు. మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకోవడంతో నిషేధం ఎత్తేశారు. హైదరాబాద్‌లో నా ప్రాణాలకు ముప్పు వుంది” అని తెలిపింది.
తెలంగాణలో… తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో… శ్రీరెడ్డి ప్రాణాలకు నిజంగా ముప్పు వుందా? ఆమె జీవించడానికి హైదరాబాద్ సురక్షిత నగరం కదా? ఒకవేళ ఆమెను ఇక్కడ ఎవరైనా బెదిరిస్తే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? ఆధారాలు ఎందుకు చూపడం లేదు? ఒకవేళ పోలీసులు పట్టించుకోక పోతే మానవ హక్కుల సంఘాలు వున్నాయి కదా? ప్రజలు ఏవీ ఆలోచించకుండా గుడ్డిగా తన మాటలు నమ్మేస్తారని శ్రీరెడ్డి భావిస్తుందేమో! ‘నలుగురూ నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.