మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణాన్ని.. బీజేపీ చాలా తెలివిగా వాడుకుంటోంది. ఆయన మరణించినప్పటి నుంచి పక్కా ప్లాన్‌గా…కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పుడు చితాభస్మంతోనూ… అలాంటి సెంటిమెంటల్ వ్యవహారాలు చాలా చురుగ్గా నిర్వహిస్తోంది. వాజ్‌పేయి అస్థికలను దేశంలోని వంద నదుల్లో నిమజ్జనం చేసే కార్యక్రమం చేపట్టారు. దీనికి “అస్థి కలశ్యాత్ర” అనే పేరు పెట్టారు. అన్ని రాష్ట్రాల భాజపా అధ్యక్షులు తమ తమ రాష్ట్రాల్లో ఈ యాత్ర నిర్వహించి అనంతరం అస్థికలను నదుల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ మేరకు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా తదితర భాజపా నేతలు వివిధ రాష్ట్రాల భాజపా అధ్యక్షులకు వాజ్‌పేయీ అస్థికలను ఉంచిన పాత్రలను అందజేశారు.
వాజ్‌పేయీ అస్థికలతో నిర్వహించే ఈ అస్థి కలశ్యాత్ర ద్వారా దేశంలోని ప్రజలు తమ ప్రియమైన నేతకు నివాళులర్పించవచ్చట. అన్ని పార్టీల నేతలకూ.. వాజ్‌పేయి మరణం సెంటిమెంట్‌ను ఎలా రాజకీయం చేసుకోవాలో అమిత్ షా ప్రత్యేకంగా చెప్పి పంపించారు. తమ రాష్ట్ర రాజధాని నగరం నుంచి యాత్ర ప్రారంభించి ఇతర ప్రాంతాల గుండా యాత్ర చేయాలట. వాజ్‌పేయికి నివాళుర్పించే అవకాశం ప్రజలందరికీ కల్పించాలట. యాత్ర అనంతరం నదుల్లో అస్థికలు నిమజ్జనం చేయాలట. ఈ చితాభస్మం… తెలుగు రాష్ట్రాలకు కూడా చేరుకుంది. ఈ రోజు.. తెలుగు రాష్ట్రాల్లో యాత్రలు చేయబోతున్నారు నేతలు.
మొత్తానికి కేరళ వరదలు రాబట్టి.. వాజ్‌పేయి వ్యవహారంలో కాస్తంత సెంటిమెంటల్ ఎమోషన్ తగ్గింది కానీ… భారతీయ జనతా పార్టీ, ప్రధాని మోడీ ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గి ఉండేవారు కాదేమో. అప్పటికే…ఏడు కిలోమీటర్ల దూరం నడిచిన మోడీకి… బీజేపీ ఫ్యాన్స్ వీర తాళ్లు వేసేస్తున్నారు. ఇప్పుడు వాజ్‌పేయి చితాభస్మాన్ని కూడా… బీజేపీ కోసం వాడేస్తున్నారు.