తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… ముందస్తు ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లాలనే పట్టుదలతో ఉన్నారు. దానికి సంబంధించి రాజకీయ, పాలనా పరమైన జాగ్రత్తలు ఆరు నెలల ముందు నుంచే తీసుకుంటున్నారు. తీరా సమయం వచ్చే సరికి… ఆయనకు ఢిల్లీ నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ఇప్పటికిప్పుడు.. అసెంబ్లీని రద్దు చేసినా… ఏడాది చివరిలో జరగనున్న… నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్న సమాచారం.. ఈసీ నుంచి… తెలంగాణ ప్రభుత్వానికి అందినట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణం ఈసీ… పార్లమెంట్‌కు కానీ.. అసెంబ్లీలకు కానీ.. ఎన్నికలు నిర్వహించాలంటే..ఏడాది ముందుగా కసరత్తు ప్రారంభిస్తుంది. ఓటర్ల జాబితా నుంచి… ఈవీఎంల వరకూ..అన్నింటినీ ప్రణాళిక ప్రకారం.. సిద్ధం చేసుకుంటుంది.
షెడ్యూల్ ప్రకారం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటే జరగాల్సి ఉంటుంది. అంటే జమిలి ఎన్నికలు. అందుకే ఈసీ.. ఆ సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికే… ఏర్పాట్లు చేసుకుంటోంది. కానీ కేసీఆర్.. ఆరు నెలల ముందుగా.. ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. ఈసీ నుంచి నిరాశజనక సమాధానం రావడంతో.. ఆయన అత్యున్న స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి కారణం కూడా.. ముందస్తు విషయంలో సహకారం కోసమేనన్న ప్రచారం ఉండనే ఉంది. కానీ కేంద్రంతో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నా… ఈసీ మాత్రం… తేడాగా స్పందించడంతో… కేసీఆర్ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్క అంశంపైనా… ప్రధాని మోడీ.. సానుకూల నిర్ణయాలు తీసుకోవడం లేదు. కనీసం ముందస్తుకు అయినా సహకరిస్తారేమో అని చూస్తే.. ఈసీకి ఎలాంటి సూచనలు చేయడం లేదు. రాజీవ్ శర్మతో పాటు కేటీఆర్‌ను కూడా పంపి… లాబీయింగ్ చేసినా.. ఫలితం కనిపించకపోవడంతో.. తానే స్వయంగా ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ప్రధానిని కూడా.. కలసి.. ముందస్తుకు మార్గం సుగమం చేసుకునే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అంటే ఇప్పుడు తెలంగాణలో ముందస్తు ఈసీ చేతుల్లో అంటే.. కేంద్రం చేతుల్లోనే ఉందన్నమాట.