మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాని అంటుంటారు కదా! అంటే… కళ్లతో చూసే నిజం నిజం కాదేమో, అసలు నిజం ఇంకొకటి వుందేమో అని! ‘వీరభోగ వసంతరాయులు’ టీజర్ కథ కూడా ఇటువంటిదే. టీజర్లో ప్రేక్షకుల కళ్లకు కనిపించినది ఒక్కటి… వెనుక వినిపించిన మాటలు మరొకటి! అందరిలో కథ గురించి ఆసక్తి కలిగించడానికి టీజర్‌ని అలా కట్ చేశార్ట! ‘నాకు తెలుసు.. మీరు వాళ్ల రాక కోసం ఎన్ని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారో! నాకు తెలుసు.. మీరు వాళ్లు ఎలాగైనా వస్తారని ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో!’’ అని చెప్పిన డైలాగులు దేవుళ్లకు సంబంధించి కాదు. సినిమా అసలు కథ వేరే వుందట! ట్రైలర్లో కథ గురించి క్లారిటీ ఇస్తామని అంటున్నాడు నారా రోహిత్. అయితే… ప్రస్తుతం టీజర్ గురించి జరుగుతున్న చర్చను ఈ హీరో ఎంజాయ్ చేస్తున్నాడు. ‘‘మనం ఒకటి అనుకుంటే… ప్రేక్షకులు మరోలా అర్థంచేసుకున్నారేంటి? అనుకున్నా. ట్రైలర్‌తో కథ గురించి ప్రేక్షకులకు ఒక ఐడియా వస్తుంది’’ అని నారా రోహిత్ చెప్తున్నాడు. దేవుళ్లుకు, గ్రహాంతరవాసిగా నటిస్తున్న శ్రీవిష్ణుకు, మిగతా ముఖ్య తారలు నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రియ పాత్రలకు సంబంధం ఏంటి? అనేది ట్రైలర్లో తెలుస్తుందన్న మాట!!