తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు. తెలంగాణ ఏర్పడిన తరవాత.. తెలుగు సినిమా ఏపీకి మరలిపోతుందనుకున్నారు. కానీ ఆ ప్రయత్నాలేం అంత సజావుగా సాగడం లేదు. తెలుగు సినిమా ప్రస్తుతానికైతే.. తెలంగాణలోనే ఉంది. ఏపీకి వెళ్లే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సినీ పరిశ్రమని ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.చిన్న సినిమాలకు సబ్సిటీ, ఓ స్టూడియో నిర్మించడం.. అందులో భాగాలే. ఇప్పుడు సెన్సార్ బోర్డు కూడా రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రతీ రాష్ట్రానికో సెన్సార్ బోర్డు ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమాలన్నీ హైదరాబాద్లోనే సెన్సార్ జరుపుకుంటున్నాయి. త్వరలో ప్రాంతీయ సెన్సార్ బోర్డు కార్యాలయం అమరావతిలోనూ ఏర్పాటు చేస్తారట. అందుకు సంబంధించిన అనుమతులు త్వరలోనే రానున్నాయని సమాచారం. అమరావతిలో మరో ప్రాంతీయ సెన్సార్ బోర్డు ఏర్పాటైతే.. తెలుగు సినిమాలు ఇక నుంచి అక్కడ కూడా సెన్సార్ జరుపుకోవచ్చు. నాలుగు కోట్ల బడ్జెట్లోపు పూర్తయిన సినిమాల్ని చిన్న సినిమాలుగా గుర్తించాలని, వాటికి టాక్స్ నుంచి మినహాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు… సంవత్సరానికి 15 చిత్రాల్ని ఎంపిక చేసి, ఒక్కోదానికీ రూ.10 లక్షల సబ్సిటీ ఇవ్వబోతోంది. ఇవన్నీ తెలుగు సినీ పరిశ్రమని ఆకర్షించే ప్రయత్నాలే. మేం ప్రకటించిన 5 సంవత్సరాల సినిమా, టీవి నంది అవార్డుల ప్రదానోత్సవం అమరావతిలోనే వుంటుంది. నవం బర్ లేదా డిసెంబర్లో ఈ కార్యక్రమం అత్యంత గ్రాండ్గా జరపడానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే నాటక రంగానికి చెందిన అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్లో ఏలూరులో జరుగుతుంది.