ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. తను ప్రతి ఆదివారం రాసే.. కొత్తపలుకులో.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూంటారు. ఈ సారి… ఓ రకంగా కొంత సెన్సేషనల్ విషయన్నే వెల్లడించారు. అదే.. టీఆర్ఎస్లో హరీష్ రావు ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గిస్తూ పోవడం. ముందస్తుగా ఎన్నికలు జరిపి.. టీఆర్ఎస్ను గెలిపిచి.. కేటీఆర్‌ను.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టాలన్న లక్ష్యంతో.. కేసీఆర్ రాజకీయ చదరంగం ప్రారంభించారు. మామలుగా అయితే ఈ ఎన్నికల చదరంగంలో.. హరీష్ రావు.. అత్యంత కీలకంగా వ్యవహరించే వారు. అన్ని వ్యవహారాలు చక్క బెట్టేవారు. కానీ ఇప్పుడు హరీష్ రావు జాడ కనిపించడం లేదు. ఆయనకు పెద్దగా బాధ్యతలు ఇవ్వడం లేదు.
గతంలో ఉపఎన్నిక వచ్చినా.. బహిరంగసభలు నిర్వహించాలన్నా.. ముందుగా హరీష్ రావున పిలేచేవారు కేసీఆర్. కానీ.. కుమారుడికి పట్టం కట్టాలనుకుంటున్న ఆయన మెల్లగా హరీష్ రావు ప్రాధాన్యం…తగ్గిస్తూ వస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పాతిక లక్షల మందితో… కొంగకలాన్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగసభ బాధ్యతలను… కేసీఆర్ .. తన కుమారుడు కేటీఆర్‌కే అప్పగించారు. మామూలుగా అయితే.. ఇలాంటి మెగా సభలు నిర్వహించే బాధ్యతను హరీష్ కు అప్పగిస్తారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి కేటీఆర్ వచ్చారు. ఆయనే సభ బాధ్యతలు తీసుకున్నారు. వరుసగా అన్ని జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ.. జనసమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదొక్కటే.. కాదు.. ఇటీవలి కాలంలో నిజంగానే హరీష్ రావు ప్రాధాన్యం.. టీఆర్ఎస్లో తగ్గిపోయింది. ముఖ్యమంత్రి స్థాయి నిర్ణయాలన్నీ.. ఇప్పుడు కేటీఆర్ తీసుకుంటున్నారు. కేవలం ప్రాజెక్టుల విషయంపై మాత్రమే.. అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తూంటేనే.. హరీష్ రావు పూర్తిగా సైడైపోతున్నారన్న ప్రచారం టీఆర్ఎస్ లో ఊపందుకుంటోంది. దీనిపై హరీష్ స్పందన ఎలా ఉంటుందో కానీ… ఆయన అనుచరులను కూడా మెల్లగా దూరం పెడుతున్నారు. అంటే ఓ రకంగా.. ఇప్పుడు మిణుకు మిణుకు మంటున్నా.. వచ్చే ఎన్నికల తర్వాత హరీష్ రావు పని టీఆర్ఎస్తో అయిపోయినట్లేనన్న గుసగుసలు .. బయటకే వినిపిస్తున్నాయి.