మహారాష్ట్రలోని బీమా-కోరెగాంలో జరిగిన దాడుల వ్యవహారం తర్వాత.. పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. అక్కడ దళితులపై దాడులు జరిగాయి. కానీ ఆ ఘటన వెనుక మావోయిస్టులు ఉన్నారనేది.. పోలీసుల అనుమానాలు. ఆ అనుమానాలు ఎక్కడిదదాకా వెళ్లాయంటే.. ఏకంగా ప్రధానమంత్రిని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని.. ఆరోపించేంత వరకూ వెళ్లాయి. అలాంటి ప్రయత్నం ఏదైనా బయటపెడితే.. కేంద్ర ప్రభుత్వ ఎజెన్సీలు క్షణం ఆగకుండా రంగంలోకి దిగుతాయి. కానీ ఇప్పటికీ… కేసును పుణె పోలీసులే విచారిస్తున్నారు. వీరిపై అత్యంత కఠినమైన UAPA కేసు నమోదు చేశారు. దేశంలో ఇప్పటికే..ఐదుగురి పై మాత్రమే ఈ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే యాక్ట్ విరసం నేత వరవరరావు పై కూడా నమోదు చేశారు. ఈ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 15,16,17 కింద కేసు నిరూపితం అయితే టెర్రరిస్ట్ గా భావించి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉది.
మావోయస్టు సానుభూతి పరునిగా చెప్పుకునే విల్సన్ అనే వ్యక్తి ల్యాప్‌ట్యాప్‌లో దొరికిన ఉత్తరాంలటూ.. వాటిని మీడియాకు లీక్ చేసి.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హక్కుల నేతలందర్నీ అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. ఇందులో వరవరరావు కూడా ఉన్నారు. నిజానికి మోడీ హత్యకు కుట్ర పన్నినట్లు లేఖలు తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. ఆ లేఖలు ఎవరు రాశారో.. దాని మీద సంతకాలుకూడా లేవు. అయినా పోలీసులు మాత్రం.. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
హక్కుల కోస పోరాడే నేతలను అరెస్ట్ చేయడంపై దేశవ్యాప్త దుమారం రేపుతోంతి. ఇంతకు ముందెన్నడూ చూడని అత్యవసర పరిస్థితి దేశం ముంగింట పొంచి ఉందని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘లాయర్లు, కవులు, రచయితలు, దళిత హక్కుల కార్యకర్తలు, మేథావుల ఇళ్లపైనే ఎందుకు దాడులు జరుపుతున్నారని ఆమె ప్రశ్నించారు. రాబోయే ఎన్నికలకు జరుగుతున్న సన్నాహకాల్లో ఇదో భాగమేనని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క అరుంధతిరాయ్ మాత్రమే కాదు.. బీజేపీయేతర పార్టీల నేతలందరూ.. అరెస్టుల్ని ఖండిస్తున్నారు. ఇది ప్రశ్నించే గొంతుకలను నొక్కి వేయడమే అంటున్నారు.