టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకురాలు బి.జయ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. చంటిగాడు సినిమాతో దర్శకత్వం వైపు అడుగులు వేశారు జయ. `ప్రేమికులు`, `గుండమ్మగారి మనవడు`, `సవాల్` చిత్రాల్ని తెరకెక్కించారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన `లవ్‌లీ` మంచి విజయాన్ని అందుకుంది. `వైశాఖం` ఆమె చివరి చిత్రం. ఎంఏ పట్టాపుచ్చుకున్న జయ.. పాత్రికేయవృత్తిపై ప్రేమతో జర్నలిస్టుగా మారారు. జ్యోతిచిత్ర, ఆంధ్రజ్యోతి పత్రిలకు పనిచేశారు. భర్త, సీనియర్ సినీ పాత్రికేయుడు బిఏ రాజుతో కలసి `సూపర్ హిట్` మ్యాగజైన్‌ని స్థాపించారు. ఆ తరవాతే దర్శకత్వం వైపు అడగులు వేశారు. బిఏ రాజుతో కలసి పలు చిత్రాల్ని రూపొందించారయన. `వైశాఖం` సొంత బ్యానర్‌లో రూపొందిన చిత్రమే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో గుండెపోటితో మరణించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని పంజగుట్ట స్మశాన వాటికలో జయ అంత్యక్రియలు నిర్వహిస్తారు.