పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నేడు. సాధారణంగా అయితే.. పవర్ స్టార్… అనే బిరుదు ఆయన ముందు విశేషణంగా వాడకూడదు. ఎందుకంటే.. అది వెండితెరకి పరిమితం. ఇప్పుడు వెండితెరకి ఆయన విరామం ఇచ్చారు. అది శాశ్వతమో.. అశాశ్వతమో.. త్వరలో తెలియవచ్చు. గతంలో చిరంజీవి కూడా.. రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నా… ఇక సినిమాలు చేయనని.. టాలీవుడ్ మొత్తానికి చాలా పెద్ద పార్టీ ఇచ్చారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక సినిమాలు తీస్తున్నారు. అందుకే ఏదైనా కాలమే నిర్ణయించాలి. రాజకీయాల్లో ఆయనకు ఇంకా ప్రత్యేకమైన బిరుదేమీ రాలేదు. ఆయన జనసేన అధినేత కాబట్టి.. జనసేనాధినేత అంటున్నారు. ఇప్పుడు మనం ఆయనకు పవర్ స్టార్‌గా జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేం. జనాధినేతగానే చెప్పాలి.
పుట్టినరోజు నాడు విమర్శలు చేయలేం కానీ.. మంచి మాటలు మాత్రం చెప్పవచ్చు. సాధారణంగా… ఆయనకు ఎవరి సలహాలు వినే అలవాటు లేదని చెబుతారు కానీ.. సగటు అభిమానులు.. ఆయన ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించేవారు మాత్రం.. పవన్ నుంచి ఇంకా కొంచెం.. కొంచెం ఆశిస్తున్నారు. రాజకీయం అంటే డైలాలుగు కాదని.. పాటలు రిలీజ్ చేసుకోవడం కాదని.. ఇంకా ఏదో ఉందని.. గుర్తు చేద్దామనుకుంటున్నారు. ప్రజల్లో ఉండటం అంటే.. మూడు నెలలకో పదిహేను రోజులు. పోరాటయాత్రలు చేయడం కాదని.. ఇంకా.. ఇంకా ఏదో చేయాలని మథన పడుతున్నారు. రోజుల తరబడి కనిపించకుండా పోయే రాజకీయ నేతకు భవిష్యత్ ఉంటుందని.. ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. అందుకే పవన్ కల్యాణ్…మరితంగా ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నారు.
జగన్లాగో..చంద్రబాబులాగో.. రాజకీయ వ్యూహాల్లో మునిగి తేలాలని.. పాదయాత్రలు చేయాలని.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ..ఏదో ఓరాజకీయ కార్యక్రమం పెట్టుకోవాలని ఫ్యాన్స్ ఆశ పడటం లేదు. కానీ.. రోజుల తరబడి.. కనిపింకుండా.. కార్యకాపాలేమీ లేకుండా.. స్తబ్దుగా ఉండి పోతూండటమే వారిని ఆవేదనకు గురి చేస్తోంది. రాజకీయాలకు కూడా షెడ్యూల్స్ పెట్టుకుంటే.. కష్టమేనని.. పవన్‌ను ఉన్నతంగా చూడాలనుకుంటున్న వారు బాధపడిపోతున్నారు. పవనిజం అంటే.. అంతేనని సరిపెట్టుకుంటున్నారు. బయటకు చెప్పుకోలేకపోతున్నారు. రాజకీ రాజకీయ పార్టీని నడపటం.. అంటే.. తాను చిటికెలో అన్ని మార్చేస్తానని.. ఏడాది పాటు కసరత్తు చేసి..మ్యానిఫెస్టోకి బదులు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినంత తేలిక కాదని అంటున్నారు. మరి పుట్టిన రోజు నుంచైనా.. పవన్ తన ఫ్యాన్స్ ఆశలు నేరవేర్చేందుకు ప్రయత్నిస్తారో లేదో మరి..!