‘హీరోగా నటించిన సమయంలో నన్నెవరూ కమెడియన్‌గా చేయమని అడగలేదు’ – ఇదీ సునీల్ తాజా మాట! ఒక్కటంటే ఒక్క అవకాశం మాత్రమే వచ్చిందనీ, అదీ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ అని చెప్పాడు. అందులో కమెడియన్‌గా నటించాలని అనుకున్నప్పటికీ… ‘ఈడు గోల్డ్ ఎహె’ క్లయిమాక్స్ షూటింగ్, ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ షెడ్యూల్స్ క్లాష్ కావడంతో చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సునీల్ హీరోగా ఏ సినిమా చేయడం లేదు. ‘సిల్లీ ఫెలోస్’లో హీరో నుంచి మళ్లీ కమెడియన్‌గా రూటు మార్చాడు. దీని తరవాత ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’, మహేశ్‌బాబు ‘మహర్షి’, శర్వానంద్ ‘పడిపడి లేచె మనసు’ సినిమాల్లో కమెడియన్‌గా చేస్తున్నాడు. ఈ టైమ్‌లో హీరోగా ఎవరైనా కథతో వస్తే చేస్తాడా? సునీల్ మళ్లీ హీరోగా నటించే ఛాన్స్ వుందా? అంటే… వుంది! హీరోగా నటిస్తానని ఇద్దరు నిర్మాతలకు మాట ఇచ్చానని సునీల్ అన్నాడు. అయితే… ఆ సినిమాలు ఇప్పట్లో పట్టాలు ఎక్కే అవకాశాలు లేవు. ‘‘మలయాళంలోనో, తమిళంలోనో విజయం సాధించి… నా బాడీ లాంగ్వేజ్‌కి సూటవుతాయని అనిపిస్తే రీమేక్ సినిమాల్లో నటిస్తా. నాకు రెండు కమిట్మెంట్స్ వున్నాయి. ఇద్దరు నిర్మాతలకు హీరోగా చేస్తానని మాట ఇచ్చా. రీమేక్ ఎందుకంటే… సేఫ్ కాబట్టి’’ అని సునీల్ తెలిపాడు. భవిష్యతుత్తలో సునీల్ మళ్లీ హీరోగా చేసే అవకాశాలు వున్నాయని ఈ మాటలతో స్పష్టమైంది.