శ్రీవారి నగల కేంద్రంగా.. కొద్ది రోజుల కిందట జరిగిన రాజకీయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోయి ఉండరు. శ్రీవారి నగలు మాయమయ్యాయని.. అవి ఉండవల్లిలో చంద్రబాబు ఇంట్లో తవ్వి దాచి పెట్టారని… వైసీపీ నేతలు విమర్శలు ప్రారంభిస్తే.. శ్రీవారి వజ్రం లాంటిదే.. ఒకటి.. జెనీవాలో వేలం వేశారన… అప్పటి వరకూ.. అవే నగల్ని తన అధీనంలో ఉంచుకున్న… శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులూ ఆరోపించారు. అప్పట్లో ఒక్క శ్రీవారి ఆభరణం కూడా మిస్ కాలేదని… టీటీడీ ఈవో వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు కొద్దిగా సద్దుమణింగింది అనుకునేలోపు.. కేంద్ర సమాచార కమిషన్ రంగంలోకి దిగింది.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ అన్ని నగలు, వజ్రాలకు లెక్కచెప్పింది. అన్ని సరిగానే ఉన్నట్లు తేల్చింది. దీనితో సమస్యకు సద్దుమణిగింది. తాజాగా శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణాలు ఎక్కడున్నాయంటు కేంద్రసమాచార కమిషనర్ ప్రశ్నలతో మళ్లీ రగడ మొదలవుతోంది.
తిరుమల ఆలయాలను జాతీయ చారిత్రక, వారసత్వ స్మారక చిహ్నాలుగా గుర్తించడానికి తీసుకొన్న చర్యలు తెలియజేయాలని బీకేఎస్ఆర్ అయ్యంగార్ అనే వ్యక్తి గతంలో ఆర్టీఐ కింద పీఎంవోకు దరఖాస్తు చేశారు. అది అనేక ప్రభుత్వ శాఖలకు వెళ్లినా సరైన సమాధానం రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్కు అప్పీలు చేశారు. ఈ అప్పీలు విచారణ సందర్భంగానే కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ టీటీడీ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు.. అనేక ప్రశ్నలతో తాఖీదులు పంపించారు. శ్రీకృష్ణ దేవరాయలు శ్రీవారికి ఇచ్చిన ఆభరణాల గురించి తిరుమల ఆలయ గోడలపై చెక్కిన విషయాన్ని 2011లో 20 మంది సభ్యులు గల డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ బృందం గుర్తించి ఒక నివేదికలో పేర్కొన్నదని ధరాస్తు చేసిన వ్యక్తి పేర్కొన్నారు. అయితే ఆ వివరాలు ఆలయం దగ్గరున్న లెక్కలతో సరిపోలేదని ఆయన చెబుతున్నారు.
1952 నుంచి శ్రీవారి తిరువాభరణాల రిజిస్టర్ నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు నుంచి తీసుకొన్న ఆభరణాలు ఏమిటో వాటిలో ప్రస్తావించలేదు. కానీ, అన్ని నగలు ‘సరిగ్గానే’ ఉన్నాయి’ అని జస్టిస్ వాధ్వా కమిటీ తేల్చింది. అంతకుముందు లెక్కలు లేకపోవడాన్ని కమిటీ ప్రశ్నించిందు. ఇదే విషయాన్ని మాడభూషి శ్రీధర్ టీటీడీతో పాటు ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లారు. ఆభరణాల రక్షణకు పారదర్శక విధానాన్ని అమలు చేయాలని సూచించిన జస్టిస్ వాధ్వా నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదు? …ఆ నివేదికలోని సూచనలపై ఎలాంటి చర్యలు తీసుకొన్నారని మాడభూషి ప్రశ్నించారు. దీనిపై కేంద్ర సమచార కమిషన్ మరో సారి 28వ తేదీన విచారణ జరపనుంది. దీనిపై ఎలాంటి ఆదేశాలిస్తారోనన్న ఉత్కంఠ మత్రం కొనసాగనుంది.