ఈనెల 13న విడుదల కాబోతోంది ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి సినిమా కావడం, ట్రైలర్‌కి మంచి స్పందన రావడం, రమ్యకృష్ణ లాంటి పవర్ ఫుల్ అత్తమ్మ ఉండడం… ఈ అల్లుడికి బాగా కలిసొచ్చే అంశాలు. విడుదల తేదీ ముంచుకొస్తున్నా ప్రచార కార్యక్రమాలేం ముమ్మరంగా సాగడం లేదు. ఇప్పుడు ప్రమోషన్ల స్పీడు పెంచే యత్నంలో ఉంది చిత్ర బృందం. ఈనెల 9న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ముఖ్య అతిథులుగా ‘దేవ్ దాస్’ రాబోతున్నారు. నాగార్జున, నాని కలసి దేవదాస్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లే ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథులు. చైతూ సినిమా అంటే… నాగ్ హాజరు తప్పని సరి. ‘భలే భలే మగాడివోయ్’తో నానికీ, మారుతికీ మంచి స్నేహం కుదిరింది. అందుకే నాని కూడా ఓ అతిథిగా రాబోతున్నాడు. సమంత కూడా ఈవెంట్ లో పాలు పంచుకోబోతున్నట్టు సమాచారం.