ప్రియమైన డాలర్‌కు రూపాయి ఆవేదనతో రాస్తున్న లేఖ ఇది. డియలర్ డాలర్ ఒకప్పుడు మనం ఎంతో స్నేహంగా ఉండేవాళ్లం. ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్లం. మన మధ్య బంధం దశాబ్దాల నాటిది. ఆ రోజులు గుర్తొస్తే ఎంతో బాధ కలుగుతుంది. నలభై, యాభై దశాల్లో మన మధ్య దూరం ఉండేది కాదు. ఎనభై దశకంలో కూడా నీకునాకు మధ్య నలభై పాయింట్లు మాత్రమే. తానీ ఇప్పుడు అందుకోలేనంత దూరం పెరిగింది. ఒక్క 2017-18లోనే మన మధ్య దూరం 10 శాతం పెరిగింది. ఇప్పుడు ఈ లేఖ రాస్తున్న సమయానికి 71.37 పాయింట్లు. ఇప్పటికీ నిపుణులు చెబుతున్నారు. 73, 74 పాయింట్ల వరకూ పోవచ్చని చెబుతున్నారు. ఇంకా ఎక్కువ పోయినా ఆశ్చర్యవపోవాల్సిన అవసరం లేదని కొంత మంది చెబుతున్నారు. సెంచరీ కొట్టవచ్చని మరికొంత మంది మా దేశంలో చర్చలు పెడుతున్నారు. ముందుగా మన మధ్య దూరం సెంచరీ కొడుతుందా.. పెట్రోల్ ధరలా.. లేక రెండూ సెంచరీ కొడతాయా అని జోకులేసుకుంటున్నారు. ఏం చేయగలం..?
డాలర్ దూరమవుతున్నా పట్టించుకోని ప్రభుత్వం, ఆర్బీఐ..!
ఒకప్పుడు… డాలర్ – రూపాయికి మధ్య దూరం పెరిగితే.. వెంటనే ప్రభుత్వాలు రంగంలోగి దిగేవి. దగ్గర చేసేందుకు ప్రయత్నిచేవి. 2013లో దాదాపుగా ఇలాంటి పరిస్థితే వచ్చింది. డాలర్ కు, రూపాయికి మధ్య.. చాలా దూరం వచ్చింది. అప్పుడు ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న రఘురాం రాజన్.. డాలర్‌కి , రూపాయి మధ్య దూరం మరీ ఎక్కువగా ఉండకూడదన్న ఉద్దేశంతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించారు. బంగారం దిగుమతులపై టాక్సులు పెంచారు. ఇష్టం వచ్చినట్లుగా బంగారం కొనకుండా చేశారు. ఆ మాటకొస్తే పెట్టుబడులు తిరిగి పోకుండా.. అనేక నియంత్రణలు పెట్టారు. డాలర్లు తెచ్చుకోవడానికి ప్రభుత్వం పడని పాట్లు లేవు. ప్రవాస భారతీయులు డాలర్లు తీసుకొచ్చి.. దేశంలో పెట్టుబడులుగా పెట్టాలని… విజ్ఞప్తి చేసింది. అలా దాదాపుగా రెండు వేల కోట్ల డాలర్లు దేశానికి వచ్చాయి. ఆ చర్యల వల్ల డాలర్‌కు, రూపాయికి మధ్య దూరం బాగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మళ్లీ మళ్లీ దూరం పెరుగుతూనే ఉంది.
అమెరికా వల్లే రూపాయి బలహీనపడుతోందా..?
టర్కీ కరెన్సీ లిరా కు.. నైజీరియాలోని నైరాకు.. మధ్య ఎంత దూరం ఉంటుందో రూపాయికి డాలర్‌కి మధ్య అంత దూరం పెరుగుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. దీనికి ప్రభుత్వం… తమ చేతుల్లో ఏమీ లేదని ఇప్పుడు చెప్పుకొస్తోంది. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని.. కారణాలు చెబుతోంది. అమెరికాలో బ్యాంకుల వడ్డీల రేట్లు పెరుగుతున్నందున.. దేశంలో… ఉన్న విదేశీ పెట్టుబడులు అమెరికాకకు తరలి వెళ్తున్నాయంటున్నారు. డాలర్‌గా స్వదేశంపై కాక.. ఇండియాపై ప్రేమ ఎందుకు ఉంటుందని వేదాంతం చెబుతోంది. అమెరికా చాలా మందితో గొడవలో పెట్టుకుంటుంది. ఇరాన్‌తో ఘర్షణ పడుతోంది. అనేక దేశాలతో గొడవలు పెట్టుకుని ఆంక్షలు విధిస్తోంది. ఈ చర్యల వల్ల కూడా.. రూపాయి విలువ పడిపోతోందని కేంద్రం చెప్పుకొస్తోంది.
దేశంలో ఉన్న పరిస్థితులు చక్కదిద్దడం చేత కాదా..?
కేవలం అమెరికాలో ఉన్న పరిస్థితుల వల్లే..డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం లేదు. భారత్‌లో ఉన్న పరిస్థితులు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ విధానాలు దీనికి కారణం. కొంత కాలం నుంచి దిగుమతుల్ని విస్తృతంగా సరళతరం చేసింది ప్రభుత్వం. ఫలితంగా.. అవసరం ఉన్నా లేకపోయినా… ఇష్టం వచ్చిటన్లు దిగుమతులు చేసుకుంటున్నారు. చైనాను మించి బంగారం దిగుమతి అవుతోంది. ఇక మన దేశంలో లేని పెట్రోలు ధరలు ప్రపంచ మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా… ప్రభుత్వం చలించడం లేదు. ఆర్బీఐ పట్టించుకోవడం లేదు. ఆర్బీఐ వద్ద పుష్కలంగా డాలర్లు ఉన్నాయి. వాటిని విడుదల చేస్తే.. డాలర్‌కి, రూపాయికి మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. కానీ ఆ విషయాన్నీ పట్టించుకోవడం లేదు. డాలర్‌కి, రూపాయికి మధ్య ఏం జరిగినా మార్కెట్‌కు వదిలేయమని కేంద్రం, ఆర్బీఐ చెబుతోంది.
ప్రభుత్వం ఏమీ తెలియనట్లు ఎందుకు ఉంటోంది..?
కానీ కేంద్రం, ఆర్బీఐ రెండింటికి.. రూపాయి బలహీనపడటం వల్ల జరిగే అనర్ధాల్ని గుర్తించడానికి ఇష్ట పడటం లేదు. దరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి పడిపోతే… ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. ఇది అందరిపైనా ప్రభావం చూపుతుంది. రైతులపై కూడా.. ఈ ప్రభావం ఉంటుంది. రైతులు.. ఎరువులు వాడతారు. అందులో ఫాస్ఫటిక్ పొటాష్ ఎరువుల్ని.. విదేశాల నుంచి కొనాలి. అంటే.. డాలర్లలోనే కొనాలి. రూపాయిల్లో డాలర్లు తీసుకుని చెల్లించాలి. దాని వల్ల ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావమేమీ తెలియని పరిస్థితిలో కేంద్రం లేదు. అన్నీ తెలిసి కూడా కేంద్రం చెల్లించడంలేదు. ఈ రూపాయి పతనం.. ఎంత దూరం పోతుంది..? కనిపించనత దూరం పోతుందేమో..? ఇంకొన్ని రోజులైతే.. ఎవరూ డాలర్ గురించి ఆలోచింరేమో. ఎందుకంటే.. అందని దాని గురించి ఎందుకని భావిస్తారేమో..?