మహేశ్‌బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘మహర్షి’. ఇప్పటి వరకూ డెహ్రాడూన్‌లో ఓ భారీ షెడ్యూల్ చేశారు. తరవాత హైదరాబాద్‌లో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. వారం రోజులు గోవాలో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలు, పాట చిత్రీకరించారు. చాలా రోజులు చిత్రీకరణ చేసినట్టుంది కదూ! కానీ, మరో వంద రోజుల షూటింగ్ బ్యాలెన్స్ వుంది! అదీ ఒక్క ‘అల్లరి’ నరేశ్ షూటింగ్ చేయాల్సిన రోజులు. ఇప్పటివరకూ నరేశ్ 40 రోజులు షూటింగ్ చేశాడట! ఒక్క నరేశే 140 రోజులు షూటింగ్ చేస్తున్నాడంటే… మహేశ్ ఎన్ని రోజులు చేస్తున్నాడో! కథానాయకుడిగా పాటలు, ఫైటులు చేస్తారు కదా! దీన్నిబట్టి చూస్తే… దర్శకుడు వంశీ పైడిపల్లి ఎక్కువ రోజులు చిత్రీకరణకు కేటాయించినట్టే! మహేశ్ కాలేజీ స్టూడెంటు రిషి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రిషి స్నేహితుడిగా నరేశ్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అతడికి కూతురు పుట్టిన తరవాత సంతకం చేసిన తొలి చిత్రం ‘మహర్షి’ అని ‘అల్లరి’ నరేశ్ తెలిపాడు. మహేశ్‌బాబు సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే!