పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసుకున్నాడు. తనకు నచ్చింది. పెళ్లికి ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. కానీ మొదటి రాత్రి గతిలో అమ్మాయి మొహం చూసి మూర్చపోతాడు. తేరుకున్న తర్వాత ఆగ్రహంతో రగిలిపోతాడు. ఇలాంటి సీన్లు సినిమాల్లో చాలా ఉంటాయి. కానీ నిజజీవితంలో జరిగితే..? ఆ పెళ్లికొడుకు పూర్తిగా హర్ట్ అయి ఉంటే ఏం జరుగుతుంది..?. ప్రాణాలు తీసుకుంటాడు. విజయనగరంలో అదే జరిగింది.
విజయనగరంలో నివాసం ఉండే మదీనా అనే ముస్లిం యువకుడి పెళ్లి నాలుగు రోజుల కిందట ఘనంగా జరిగింది. కానీ పెళ్లయిన రెండు రోజులకే.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు అంటే.. తను పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి.. పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక్కటి కాదని.. తెలిసినందుకు. ముస్లిం సంప్రదాయం ప్రకారం.. పెళ్లిలో అమ్మాయి మొహాన్ని చూడనివ్వరు. ముఖం కనిపించకుండా పువ్వులతో అలకరిస్తారు. పెళ్లి జరిగే వరకు పెళ్లి కుమార్తెను రెండో కంటపడకుండా పెళ్లికుమార్తె బంధువులు తమ ఆచారాలను పాటిస్తారు.ఆ ప్రకారమే నిఖా జరిగింది. కానీ అమ్మాయి మొహంపై మొత్తం పులిపిర్లు ఉన్నాయి. చూడటానికి కాస్తంత భయంకరంగా ఉంది. తాను పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి కాదని.. . పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయిని చూపించి…మరో అమ్మాయిని తీసుకొచ్చి తనతో నిఖా జరిపించారని స్నేహితుల వద్ద… మదీనా మథనపడ్డాడు. ఆ క్షోభతోనే ప్రాణాలు తీసుకున్నాడు.
ఈ విషయం విజయనగరం జిల్లాలో సంచనలం సృష్టించింది. రెండు కుటుంబాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తాము పెళ్లి చూపుల్లో ఎవర్ని చూపించామో.. వారితోనే పెళ్లి చేశామని పెళ్లికుమార్తె కుటుంబసభ్యులు చెబుతున్నారు. మృతుని తల్లిదండ్రులు మాత్రం నైరాశ్యంలో మునిగిపోయారు.