కమెడియన్‌గా సునీల్ సెకండ్ ఇన్నింగ్స్‌మొదలైంది.. ‘సిల్లీ ఫెలోస్’ సినిమాతో. హీరోగా చేసిన సినిమాల్లో కంటే… ఇందులో బాగానే నవ్వించాడు సునీల్. కాకపోతే మరీ లావైపోయాడు. కనీసం కదలడానికి సైతం ఇబ్బంది పడుతున్నాడు సునీల్. ఓ పాటలో అయితే.. అసలేమాత్రం స్టెప్పులు వేయలేకపోయాడు. సునీల్ ముందు నుంచీ లావే. ‘బంతి’ అనే పేరుకు తగ్గట్టుగా అతని ఆకారం ఉండేది. కాకపోతే… అప్పట్లో సునీల్ ఆకారం కూడా ముద్దుగా ఫన్నీగా ఉండేది. హీరో అయ్యాక బాగా సన్నబడిని సునీల్ మొహం పీక్కుపోయింది. ‘సునీల్ లావుగా ఉన్నప్పుడే బాగున్నాడు’ అనే కామెంట్లు వినిపించాయి. అందుకోసం ఇప్పుడు మళ్లీ లావయ్యాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. బాడీని బట్టే బాడీ లాంగ్వేజ్… దాన్ని బట్టే కామెడీ పండుతాయి. సునీల్ మరీ ఇలా బండగా మారిపోతే… మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కడ కనిపిస్తాయి…? కమిడియన్ గా సునీల్ చేతిలో చాలా సినిమాలున్నాయి ఇప్పుడు. అందులో ‘అరవింద సమేత’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ముఖ్యమైనవి. ఈ రెండు సినిమాల్లోనూ దాదాపు ఫుల్ లెంగ్త్ పాత్రలే పోషిస్తున్నాడు. ఇదే బాడీతో `అరవింద సమేత`లో సునీల్ ఏమాత్రం నవ్విస్తాడన్నది అనుమానంగా మారింది. సునీల్ రూటే కాదు… తన బాడీ కూడా తగ్గించాల్సిన అవసరం, ఆవశ్యకత… ‘సిల్లీ ఫెలోస్’ ద్వారా తెలిసొచ్చింది. ఈ ఫీడ్ బ్యాక్‌ని సునీల్ ఎలా తీసుకుంటాడో చూడాలి.