హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డికి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఇవాళ చేదు అనుభవం ఎదురయింది. రేవంత్ అమీర్‌పేట ప్రాంతంలో పర్యటనకు వెళ్ళగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీనితో టీడీపీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవటంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. చేసేది లేక రేవంత్ వెనక్కు మళ్ళారు. మరోవైపు రేవంత్ రెడ్డి తన ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కేటీఆర్‌నుద్దేశించి మాట్లాడుతూ, అరే హౌలా అని రేవంత్ వ్యాఖ్యనించారు. కేటీఆర్ శిల్పారామం వద్ద నిలుచుని చంద్రబాబు హైదరాబాద్‌కు ఏమి చేశాడని ప్రశ్నిస్తున్నాడని, ఆ శిల్పారామమే చంద్రబాబు కట్టించినదని కేటీఆర్ గుర్తుంచుకోవాలని రేవంత్ అన్నారు.