అనూ ఇమ్మాన్యుయేల్ అంత లక్కీ హీరోయిన్ మరొకరు వుండరేమో! హిట్టూ ఫ్లాపులకు అతీతంగా ఆమె అవకాశాలు అందుకుంటున్నారు. వినాయక చవితికి వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’తో సందడి చేశారామె. దీని తరవాత తెలుగులో ఆమెకు సినిమాలు లేవు. కానీ, తమిళ హీరో ధనుష్ దర్శకత్వం వహించనున్న తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ ఎంపిక అయ్యార్ట. నాగార్జున, శరత్ కుమార్, ఎస్.జె. సూర్య నటించనున్న ఈ సినిమాలో అదితిరావు హైదరిని ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా అనూ ఇమ్మాన్యుయేల్ వచ్చి చేరారు. నాగార్జునకు జోడీగా ఇద్దరిలో ఎవరు నటిస్తారో?
నిజానికి, అనూ ఇమ్మాన్యుయేల్ మొదట సంతకం చేసిన తొలి తెలుగు సినిమా ‘ఆక్సీజన్’. అయితే… రోజులకు రోజులు ఆ సినిమా ల్యాబుల్లో మగ్గింది. మూమూలుగా అయితే ఇండస్ట్రీలో దీన్నో బ్యాడ్ సెంటిమెంట్‌గా భావిస్తారు. హీరోయిన్‌కి అవకాశం ఇవ్వడానికి ఆలోచిస్తారు. ఇటువంటి సెంటిమెంట్లకు, హిట్టూ ఫ్లాపులకు అతీతంగా ఆమె అవకాశాలు అందుకున్నారు. ‘ఆక్సీజన్’ విడుదలకు ముందు ‘మజ్ను’, ‘కిట్టు వున్నాడు జాగ్రత్త’ అవకాశాలు వచ్చాయి. అవే ముందు విడుదలయ్యాయి. ఆ తరవాత అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన సినిమాలు ‘ఆక్సీజన్’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సరిగా ఆడలేదు. ప్లాప్ అయ్యాయి. తాజాగా వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫలితం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనూకి మరో అవకాశం రావడం అనుమానమే అనుకుంటున్న సమయంలో ధనుష్ ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఆమె గ్రాఫ్ చూస్తే లక్కీ అనుకోవాల్సిందే.