ఒక్క వీడియో.. ఒకే ఒక్క వీడియో… పరువు హత్యకు కారణం అయింది. తన బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకుందని.. ఎలాగైనా .. ఆ ఇంటికి తెచ్చుకోవాలని మారుతీరావు అనే వ్యక్తి తాపత్రయపడ్డాడు. కానీ ఈ లోపే.. ఆ జంట.. డ్యూయట్‌ను చిత్రీకరింప చేసుకుని.. హైక్లాస్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. అది మిర్యాలగూడలో హాట్ టాపిక్ అయింది. దీంతో మారుతీరావు… మరింతగా కులఅహంకారంతో రగిలిపోయాడు. పరువు పోయిందని ఫీలై.. తాను జైలుకెళ్లినా పర్వాలేదని.. ఓ వ్యక్తిని హత్య చేయించడానికి కూడా వెనుకాడలేదు. అదే వీడియో సాయంగా … మూడు రోజుల నుంచి.. మీడియా కొన్ని వందల మనసుల్ని మానసికంగా హత్య చేసేసింది. క్షణక్షణం.. అప్డేట్స్తో ఎంత బాధల్లో ఉన్న … ప్రణయ్ కుటుంబ సభ్యుల ముందు మైక్‌లు పెట్టింది.. వారితో .. సినిమాడైలాగుల తరహా.. కామెంట్లు చేయించి.. బ్రేకింగులు వేయించి…పరుగులు పెట్టింది. అంత్యక్రియలు పూర్తయ్యేదాకా.. సెకను కూడా వదిలి పెట్టలేదు.
నిజానికి ఇలాంటి పరువు హత్యలు ప్రతీ రోజూ ఏదో ఓ మూల బయటపడుతూనే ఉంటాయి. అంత ఎందుకు.. నల్లగొండ జిల్లాలోనే ఇటీవలి కాలంలో… మూడు, నాలుగు పరువు హత్యలు.. అత్యంత ఘోరమైనవి జరిగాయి. కానీ ఎందుకు మీడియా ఇంత హడావుడి చేయలేదు. ఆ పరువు హత్యలకు గురైన వారి.. అందుమైన వీడియోలు, ఫోటోలు దొరకలేదనే..? వాటి నుంచి.. టీఆర్పీలు రాబట్టుకోలేమనే..? అంతులేని విషాదంలో ఉన్న ప్రణయ్ కుటుంబంతో మీడియా.. ఎమోషనల్ గేమ్ ఆడింది. వారి భావోద్వేగాలను… మరింత పెచింది.. వారి చేత “మా నాన్నను ఉరి తీయాలి..” “నా ముందుకు తీసుకొస్తే నేనే చంపేస్తా” ” ఎనిమిదో తరగతి చదివే బాబాయ్ కొడుకు లైంగికంగా వేధించాడు..” ” బాబాయ్‌కి అక్రమ సంబంధాలున్నాయి..” ” జైల్లోనే చచ్చిపో .. బయటకొస్తే.. జనమే చంపేస్తారు..” లాంటి డైలాగుల్ని తెప్పించి.. టీఆర్పీలను పెంచుకోవడంలో… టీవీ చానళ్లన్నీ పోటీ పడ్డాయి. బిగ్ బాస్ షోలో.. ఎంత మాత్రం ఎమోషనల్ గేమ్ నడుస్తుందో.. గత మూడు రోజులుగా… ప్రణయ్ కుటుంబంతో.. మీడియా.. అంతే ఎమోషనల్ గేమ్ ఆడింది. టీఆర్పీలు పెంచుకుంది.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన జీవితభాగస్వామిని చూస్తూ.. అమృత పెట్టే కన్నీళ్లు..ఆ తల్లిదండ్రుల గర్భశోకం… మీడియాకు టీఆర్పీ మేతగా మారాయి. ఇంత హడావుడి చేసిన మీడియా.. కులగజ్జిని తగ్గించిందా..? కనీసం ఒక్కరిలో అయినా మార్పు తీసుకొస్తుందా..?. చాన్సే ఉండదు. ఎందుకంటే.. కులం గురించి మార్పు మనసుల్లో నుంచి రావాలి. ఇలాంటి హత్యలు జరిగినప్పుడు… దానికి మీడియా ఇచ్చే కవరేజీ ఇంత దారుణంగా.. ఉన్నప్పుడు.. మనషుల్లో కులాల అంతరాలు పెరుగుతాయే తప్ప.. తగ్గవు. ఈ విషయం… ఏ మాత్రం సామాజిక అవగాహన ఉన్న వారికైనా అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో.. ఆ తండ్రికి మద్దతుగా.. వెల్లువెత్తిన అభిప్రాయాలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. హత్యను ఎవరూ సమర్థించరు. కానీ మీడియా చేసిన అతి వల్ల.. చివరికి ఆ కర్కోట తండ్రికి కూడా.. సోషల్ మీడియాలో మద్దతు వచ్చింది. అది కులం ప్రకారం కావొచ్చు.. తండ్రి కోణంలో ఆలోచించడం కావొచ్చు… భావాల వ్యతిరేకత వల్ల కావొచ్చు..! ఏదైనా కానీ…మిర్యాలగూడలో జరిగిన ఓ జరగకూడని హత్య .. దాని కేంద్రంగా మీడియా చేసిన హడావుడి మరిన్ని మానసిక హత్యలకు కారణం అయింది. ప్రణయ్‌తో పాటు.. రిప్ మీడియా వాల్యూస్ అని సర్దిచెప్పుకోక ఏమీ చేయలేని పరిస్థితి సామాన్యులది. రోజు రోజులు మనిషి వంటిపై వలువలు ఎలా తగ్గిపోతున్నాయో.. మీడియాలో విలువలు కూడా అలాగే తగ్గిపోతున్నాయి…!