తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి.. ఏపీ ప్రభుత్వ అజమాయిషీ నుంచి తొలగించేలా చేస్తానని శపథం చేసిన బీజేపీ ఎంపీ.. సుబ్రహ్మణ్య స్వామికి సుప్రీంకోర్టులో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆయనవేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. టీటీడీని ఏపీ ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలని ఆయన స్వయంగా తాను వేసిన పిటిషన్‌పై స్వయంగా వాదించుకున్నారు. స్థానిక చట్టాల ఆధారంగా టీటీడీ పనిచేస్తోందని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్‌ను తిరస్కరించింది. కావాలంటే.. హైకోర్టుకు వెళితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదనే వెసులుబాటును కల్పించింది.
ఇటీవలి కాలంలో టీటీడీ విషయంలో అనేక వివాదాలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం.. ఆలయాన్ని అధీనంలోకి తీసుకుంటామని.. ఆర్కియాలజీ శాఖ నోటీసులు జారీ చేసింది. దానిపై వివాదం సద్దుమణగక ముందే రమణదీక్షితులు తెరపైకి వచ్చారు. ఈ వివాదాలన్నింటిని చూపిస్తూ.. సుబ్రహ్మణ్యస్వామి కోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ ప్రభుత్వం నుంచి తిరుల వెంకన్న నుంచి విముక్తం చేస్తానని సుబ్సహ్మణ్య స్వామి చాలా రోజులుగా ప్రచారం చేసుకుంటున్నారు. రమణదీక్షితులు కూడా.. పిటిషన్ వేసేందుకు… సుబ్రహ్మణ్యస్వామికి సహకరించారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ పిటిషన్ ఇప్పుడు సుప్రీంకోర్టులో కనీస పరిశీలనకు కూడా రాలేదు.
అయితే.. హైకోర్టుకు వెళ్లవచ్చని… సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్యస్వామికి స్వేచ్చనిచ్చింది. ఈ విషయంలో సుబ్రహ్మణ్యస్వామి.. హైకోర్టుకు వస్తారా..? లేక అంతటితో వదలేస్తారా అన్నదానిపై క్లారిటీ లేదు. సాంకేతిక అంశాలతో.. సుబ్రహ్మణ్య స్వామి వేసే పిటిషన్లు కొన్ని కొన్ని సార్లు సంచలాత్మక వ్యవహారాలు బయటకు రావడానికి కారణమయ్యాయి. అయితే అదే అడ్వాంటేజ్‌గా ఆయన ప్రతీ విషయానికి పిటిషన్లు వేస్తూండటంతో.. ఇటీవలి కాలంలో చాలా సార్లు సుప్రీంకోర్టు ఆయనకు మెట్టికాయలు వేసింది. మరి టీటీడీ విషయంలో.. హైకోర్టుకు వెళ్తారా..? లేక లైట్ తీసుకుంటారో వేచి చూడాలి..!