వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విజయవాడలో పాదయాత్రగా అడుగు పెట్టగానే… జిల్లా నేతలందరికీ.. ముందుగా ఓ క్లారిటీ ఇచ్చారు. అదేమిటంటే… విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నంచి… వంగవీటి రాధానే పోటీ చేస్తారు. ఎవరూ కల్పించుకోవద్దనేది ఆ క్లారిటీ సారాంశం. దానికి తగ్గట్లుగానే వంగవీటి రాధా క్యాడర్‌ను సమాయత్తం చేసుకుంటున్నారు. అయితే అనూహ్యంగా పాదయాత్ర విశాఖకు చేరే లోపు.. జగన్ మనసు మార్చుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణుల ఓట్లు అత్యధికంగా ఉంటాయి కాబట్టి..ఆ స్థానానికి బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన మల్లాది విష్ణుకు ఇస్తున్నట్లు… తేల్చారు. మరి బ్రాహ్మణ ఓట్లు.. విజయవాడ సెంట్రల్లో ఎక్కువగా ఉన్నాయని… ఇప్పుడే తెలిసిందా..? మల్లాది విష్ణు ఇప్పుడే పార్టీలో చేరారా..?.జగన్‌కు అన్నీ తెలుసు.. అన్నీ తెలిసే.. వంగవీటికి అప్పట్లో టిక్కెట్ ప్రకటించారు.. ఇప్పుడు నిరాకరించారు..!
పాదయాత్ర విశాఖకు చేరుకునేలోపు.. జగన్మోహన్ రెడ్డి.. చేసుకున్న అతి పెద్ద సెల్ఫ్ గోల్స్ ప్రభావం… వంగవీటిపై పడినట్లు తలుస్తోంది. అందులో ఒకటి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై… వ్యక్తిగత విమర్శలు చేయడం.. రెండోది.. కాపు రిజర్వేషన్లపై వ్యతిరేక ప్రకటనలు చేయడం. ఈ రెండు ఘటనలతో… కాపు సామాజికవర్గం మొత్తం జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకమయింది. ఓ వైపు పవన్ కల్యాణ్… కాపు సమాజికవర్గంలోని యువత ఓట్లను ఆకర్షించడం ఖాయం. మిగతా ఓట్లను.. తన చర్యల ద్వారా జగన్ దూరం చేసుకున్నారు. దీంతో.. ఎంత చేసినా.. కాపు సామాజికవర్గం ఓటర్లు తనకు ఓటేయరు కాబట్టి.. కాపు సామాజికవర్గం నేతలను.. పక్కన పెడుతున్నానే ప్రచారం వైసీపీలో జరుగుతోంది. ఇటీవల ఐవైఆర్ కృష్ణారావు, రమణదీక్షితుల వివాదాల కారణంగా… బ్రాహ్మణులు చంద్రబాబుకు దూరమయ్యారని.. వారంతా.. వైసీపీకి అనుకూలంగా మారారని.. జగన్ భావిస్తున్నారు. అందుకే రెండు చోట్ల.. అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని డిసైడయ్యారు. ఒకటి బాపట్ల కాగా.. మరొకటి విజయవాడ సెంట్రల్.
కాపు ఓట్లతో పడే మైనస్‌ను బ్రాహ్మణ ఓట్లతో పూరించుకోవాలన్న ఉద్దేశంతోనే.. జగన్.. ఉద్దేశపూర్వకంగా.. వంగవీటి రాధాకృష్ణను నిర్లక్ష్యం చేస్తున్నారని వైసీపీలో అందరూ గట్టిగా నమ్ముతున్నారు. నిజానికి వంగవీటి రాధాకృష్ణను యాక్టివ్ చేసుకుని ఉంటే.. పవన్ కల్యాణ్ ప్రభావం కొద్దిగా అయిన వైసీపీపై పడకుండా… ఉండేదే. కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కాపుల ఓట్లు తనకు రావని.. పూర్తి స్థాయిలో నమ్మకంతో ఉన్నారన్న భావన అంతటా వినిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే… ఆయన వ్యవహారశైలి కనిపిస్తోందంటున్నారు వైసీపీ నేతలు.