‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలతో అడివి శేష్ అభిరుచి ఏంటనేది అందరికీ తెలిసింది. అందులోనూ తక్కువ బడ్జెట్లో సూపర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకొచ్చాడు శేష్. అందువల్ల, అతడితో చాలామంది సినిమాలు చేయాలని ముందుకొస్తున్నారు. కానీ, శేష్ మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. అసలు త్వరపడటం లేదు. ప్రస్తుతం హిందీ హిట్ ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇది తప్ప మరో సినిమా అంగీకరించలేదు. అయితే… ‘2 స్టేట్స్’ రీమేక్ తరవాత మహేశ్ బాబు ఫ్యామిలీలో ఒకరు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే సినిమాలో హీరోగా నటించడానికి అంగీకరించాడని టాక్. యూట్యూబ్ & ఇంటర్నెట్ సెన్సెషన్ ‘ఛాయ్ బిస్కెట్’ ఈ సినిమాతో మూవీ ప్రొడక్షన్లోకి ఎంటర్ కానుందని తెలుస్తుంది. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా దర్శకుడు ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. కాని ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్, ‘ఛాయ్ బిస్కెట్’ సంయుక్తంగా నిర్మించే సినిమాలో అడివి శేష్ నటించడం ఖాయమని సమాచారం.