ప్రతీ సంవత్సరం గ్రాండ్ గా జరిగే ఫిలిం అవార్డ్స్ లో ఐఐఎఫ్ఏ(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) అవార్డ్స్ ఒకటి.ఈ అవార్డ్స్ ని కేవలం బాలీవుడ్ లోనే జరిపే వారు.కానీ, మొట్ట మొదటి సారిగా ఈ అవార్డ్స్ ని తెలుగు, తమిళ్ , కన్నడ , మలయాళ ఫిలిం ఇండస్ట్రీస్ వారికి ఇవ్వబోతున్నారు.ఈ ఈవెంట్ ని పోయిన నెలలో హైదరాబాద్ లో జరపాలని ప్లాన్ చేసారు కానీ, చెన్నై లోని వరదల కారణంగా వాయిదా వేసారు.రెండు రోజుల పాటు జరిగే ఈ అవార్డుల ఉత్సవంలో మొదటిరోజు ఆదివారం కన్నడ, మలయాళ సినిమాలకి సంబందించిన అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈరోజు సోమవారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలో తెలుగు, తమిళ భాషల అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అటెండ్ అవ్వబోతున్నారు. ఇదిలా ఉంటె మొదటిసారిగా రామ్ చరణ్, అఖిల్ లు ఐఫా అవార్డు వేడుకపై లైవ్ డాన్స్ చేయనున్నారు.ముఖ్యంగా ఇలా లైవ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి. రామ్ చరణ్ స్టేజ్ పై 7 నిమిషాల పాటు చేయనున్నాడు. ఈ ఏడు నిమిషాల మిడ్లే లో అయన సినిమాల్లో సూపర్ హిట్ అయిన పాటలైనా బంగారు కోడిపెట్ట, వానా వానా, మెగా మీటర్, రూబా రూబా, లైలా ఓ లైలా సాంగ్స్ కి స్టెప్స్ వేయనున్నారు. వానా వానా సాంగ్ లో తమన్నా చరణ్ తో పాటు స్టెప్స్ వేస్తుందట. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చరణ్ లైవ్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిల్వనున్నది అని చెప్పొచ్చు. అంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ ని అల్లు శిరీష్ , రెజినా లు హోస్ట్ చెయ్యబోతున్నారు.