మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడి హత్య ..హాట్ టాపిక్ గా ఉండగానే.. అదే తరహాలో.. మరో ఘటన.. హైదరాబాద్ నడి బొడ్డున చోటు చేసుకుంది. ఎర్రగడ్డలో నడిరోడ్డుపై దారుణం చోటు చేసుకుంది. నెల రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న నవదంపతులపై వేటకొడవలితో యువతి తండ్రి దాడి చేశారు.యువతి పరిస్థితి విషమంగా ఉంది.గాయపడిన వారిని బోరబండకు చెందిన సందీప్, మాధవిగా గుర్తించారు.
నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న సందీప్, మాధవి ..వారం క్రితం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు.దాడికి ముందు సందీప్ ఇంటికెళ్లి మాధవిని తిరిగిరావాలని తండ్రి బతిమిలాడారు.
మాధవి, సందీప్ నిరాకరించడంతో బయటకు వచ్చిన తర్వాత మాటు వేసి దాడికి తెగబడ్డాడు తండ్రి మనోహరాచారి. మనోహరాచారిని ఎస్ఆర్ నగర్ పోలీసుల అదుపులోకి తీసుకన్నారు. మాధవి పరిస్థితి విషమంగా ఉంది, మెడపై బలంగా కత్తితో దాడి చేయడంతో వెళ్లే నరాలు తెగిపోయాయి. ఎడమ చెయ్యి తెగి పోయింది. యువకుడి పరిస్థితి కూడా సీరియస్ గానే ఉంది. మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడి హత్య.. దానికి వచ్చిన ప్రచారం.. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న కూతుళ్ల మనసుల్లో ఎంత విషం నింపిందో.. తేల్చి చెప్పే ఘటనగా దీన్ని భావించవచ్చు.
ప్రణయ్ హత్య విషయంలో ప్రజల్లో జరుగుతున్న చర్చ.. కారణంగా.. ఇలాంటి ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో.. అలాంటి ఇళ్లలో ఏర్పడుతున్న భావోద్వేగాల కారణంగా.. ఈ హత్య జరిగిందని భావించవచ్చు. మిర్యాగల గూడ ఇష్యూలో తండ్రిది కరెక్టని కొందరు… అమ్మాయిది కరెక్టని మరికొందరు వాదించుకున్నారు. సోషల్ మీడియాలోనూ దీనిపైనా.. చర్చోపచర్చలు జరిగాయి. మీడియాలోనూ.. డే అండ్ నైట్ కవరేజ్ వచ్చింది. ఫలితంగా మరో దారుణానికి దారి తీసింది. ఇంకొన్నాళ్లు… కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లు.. ఇంట్లో తీవ్రంగా ప్రతిఘటించే వాళ్లపై… దాడులు జరుగుతూనే ఉంటాయేమో. పరిస్థితి చూస్తే అందే ఉంది.