తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో.. ఎట్టకేలకు కీలక పదవుల్ని భర్తీ చేశారు. రేవంత్ రెడ్డికి.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా ఇదే పదవి లభించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు.. ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొత్తం.. 9 అనుబంధ కమిటీలను నియమించారు. 53 మందితో కోఆర్డినేషన్ కమిటీని ప్రకటించారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా, కన్వీనర్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారు. ప్రచార కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టివిక్రమార్క, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ చైర్మన్‌గా వి. హనుమంతరావు, ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్‌రెడ్డి, పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా కోదండరెడ్డిని నియమించారు. టీ పీసీసీ కోర్ కమిటీ సభ్యులుగా కుంతియా, బోస్‌రాజు, శ్రీనివాసన్‌కృష్ణన్, సలీం అహ్మద్, ఉత్తమ్, భట్టివిక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్‌అలీ , వీహెచ్, పొన్నాల, రాజనర్సింహ, మధుయాష్కి, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డిని నియమించారు.
కాంగ్రెస్ కమిటీ పదవుల కోసం చాలా రోజులుగా.. నేతలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఏ పదవి ఇస్తారన్నదానిపై కొద్ది రోజులుగా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. పార్టీలో చేరి చాలా కాలమైనా ఏ పదవీ లేకపోవడంతో. కొంత కాలంగా.. పార్టీ ముఖ్య సమావేశాలకూ… రేవంత్ రెడ్డి హాజరు కాలేకపోతున్నారు. ముందస్తు ఎన్నికలు ముంచుకు రావడంతో… ఇక కమిటీల్ని నియమించక తప్పలేదు. రేవంత్ రెడ్డికి…ప్రచార కమిటీ చైర్మన్ పదవి వస్తుందని అందరూ అనుకున్నారు కానీ.. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ తో సరి పెట్టారు. పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు ఉంటారన్న ఉద్దేశంతో ఏమో కానీ.. పొన్నం ప్రభాకర్ కూ… అదే పోస్ట్ ఇచ్చారు.
రేవంత్ తో పాటు తెలుగుదేశం పార్టీలో చేరిన నేతలకు.. పెద్దగా పదవులు లభించలేదు. అయితే రేవంత్ రెడ్డికి మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కాస్త ఊరటనిచ్చేదే. కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి… పార్టీ తరపున కొన్ని కార్యక్రమాలు నిర్వహిచడానికి రేవంత్ రెడ్డికి ఈ పదవి ఉపయోగపడుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో.. తెలంగాణ మొత్తం తిరిగి ప్రచారం చేయడానికి రేవంత్ కు అవకాశం ఉంటుంది. అయితే వారం క్రితమే పార్టీకి రాజీనామా చేసిన కేఆర్ సురేష్ రెడ్డిని మ్యానిఫెస్టో కమిటీలో వేశారు. రద్దయిన అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలుగానే సంబోధించారు. దీంతో ఈ పదవులను ఎప్పుడు ప్రిపేర్ చేశారు… ఎప్పుడు ప్రకటించారన్నదానిపై కాంగ్రెస్ లోనే సెటైర్లు పడుతున్నాయి.