అఖిల్ అక్కినేని ‘మిస్టర్ మజ్ను’ ఫస్ట్ లుక్ విడుదలైంది! అక్కినేని హీరోలను అందలం ఎక్కించిన రొమాంటిక్ జానర్లో సినిమా రూపొందింది! రోమియోగా అఖిల్ అప్పియరెన్స్, ఆటిట్యూడ్… ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి. అభిమానుల సంగతి అయితే చెప్పక్కర్లేదు అనుకోండి! ఫుల్ ఖుషీగా వున్నారు. దాసరి దర్శకత్వంలో ‘మజ్ను’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున హిట్ కొట్టారు. అంతకు ముందు తరంలో ఏయన్నార్ ‘లైలా మజ్ను’తో విజయం అందుకున్నారు. టైటిల్ సెంటిమెంట్ కలిసి వస్తుందని అభిమానులు ఖుషీగా వున్నారు. వాళ్లు మరింత ఖుషీ ఖుషీ అయ్యే మరో సంగతి ఏంటంటే? ఫస్ట్ లుక్ టీజర్లో అక్కినేని నాగేశ్వరరావు ప్రస్తావన. టీజర్ స్టార్టింగులో కారు నెంబర్ కనిపిస్తుంది. దాన్ని జాగ్రత్తగా గమనించండి… ‘ANR8’ అని వుంటుంది. ANR అంటే… అక్కినేని అని ప్రత్యేకంగా చెప్పాలా? ఇక, 8 అఖిల్ లక్కీ నెంబర్ అట! ట్విట్టర్లో అతని ఐడి ‘అఖిల్ అక్కినేని8’ అని వుంటుంది. రెండిటినీ ఫస్ట్ లుక్ టీజర్లో ఫస్ట్ ఫస్టుగా చూపించాడు. ఇదీ సెంటిమెంటో? లేక అభిమానులు హ్యాపీగా ఫీలవుతారని దర్శకుడు పెట్టారో? మొత్తానికి ఏయన్నార్ జయంతికి ఒక్కరోజు ముందు అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు అఖిల్!!