ఎన్టీఆర్ నుంచి `ఎన్టీఆర్`గా బాలయ్య, నారా చంద్రబాబు నాయుడుగా రానా లుక్‌లు బయటకు వచ్చేశాయి. ఇప్పుడు అక్కినేని లుక్‌కి రంగం సిద్ధమైంది. గురువారం ఏఎఎన్నార్ జయంతి. ఈ సందర్భంగా `ఎన్టీఆర్` బయోపిక్ నుంచి ఏఎన్నార్‌కి సంబంధించిన రెండు లుక్స్ రాబోతున్నాయి. ఉదయం 9:33 గంటలకు ఏఎన్నార్ సోలో లుక్‌ని విడుదల చేస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్, ఏఎన్నార్ (బాలయ్య, సుమంత్)ల లుక్ రాబోతోంది. ఏఎన్నార్ గా సుమంత్ కనిపించనున్న సంగతి తెలిసిందే. తాతయ్య పాత్రలో మనవడు అచ్చుగుద్దినట్టు దిగిపోయినట్టు సమాచారం. అక్కినేని అనగానే అభిమానులకు ఎలాంటి లుక్ గుర్తుకు వస్తుందో, సరిగ్గా అలాంటి లుక్‌తోనే సముంత్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. మరి ఈ లుక్‌లో సుమంత్ ఎలా ఉంటాడో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగితే సరిపోతుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 9న విడుదల కాబోతోంది.