ప్రముఖ నటుడు, నిర్మాత డా. మోహన్‌బాబు ఇంట్లో విషాదం అలుముకుంది. మోహన్ బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) కన్నుమూశారు. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో ఈ రోజు ఉదయం ఆరుగంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు అమెరికాలో ఉన్నారు. విషయం తెలుసుకుని హుటాహుటిన స్వగ్రామం బయలుదేరారు. శుక్రవారం తిరుపతిలో లక్ష్మమ్మ దహన సంస్కారాలు జరుగుతాయి.