ఇంత వరకూ కెమిస్ట్రీ అంటే హీరో, హీరోయిన్ల గురించే మాట్లాడుకునేవాళ్లం. ‘దేవదాస్’ ట్రైలర్ చూస్తే మాత్రం.. ఇద్దరు హీరోల మధ్యన పుట్టిన కెమిస్ట్రీ గురించి కూడా మాట్లాడుకోవాలనిపిస్తుంది. ఆ ఇద్దరే.. నాగార్జున, నాని. ఒకరు స్టైల్‌కి, మరొకరు ఫన్‌కి కేరాఫ్ అడ్రస్. ఇవి రెండూ జోడీ కడితే సూపరే. ఆ మ్యాజిక్ ‘దేవదాస్’ ట్రైలర్లో కనిపించింది. నాగ్, నాని కథానాయకులుగా నటించిన చిత్రమిది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. అశ్వనీదత్ నిర్మించారు. ఈనెల 27న సినిమా విడుదల అవుతుంది. కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ బయటకు వచ్చింది. నాగ్ ఓ డాన్‌గా, నాని ఓ డాక్టర్‌గా నటిస్తున్నారన్న సంగతి ముందే అందరికీ తెలిసిపోయింది. వాళ్లిద్దరూ ఎందుకు కలిశారు? కలిశాక ఏం జరిగిందన్నదే సినిమా. నానిని నాగ్ తెగ ఆడేసుకున్నాడన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అమాయకమైన ఓడాక్టర్, జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించే ఓ డాన్ మధ్య నడిచిన సన్నివేశాలు ఆధ్యంతం వినోదం పంచిపెట్టేలా ఉన్నాయి. నాగ్ స్టైల్‌గా కనిపిస్తుంటే, మరోసారి నాని తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఆకాంక్ష సింగ్, రష్మిక గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. వైజయంతీ మూవీస్‌కి తగ్గట్టుగానే మేకింగఠ్ వాల్యూ కనిపిస్తోంది. మణిశర్మ బాణీలు క్లాస్‌గా ఉన్నాయి. మొత్తానికి రెండున్నర గంటల పాటు వినోదానికి ఎలాంటి ఢోకా లేదనిపిస్తోంది. నాగ్, నాని అభిమానులకు అదే కదా కావాల్సింది.