సెప్టెంబరు 13 అక్కినిని అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే ఆ రోజు అక్కినేని కుటుంబం నుంచి రెండు సినిమాలొచ్చాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘యూ టర్న్’ రెండూ ఒకేసారి విడులయ్యాయి. అయితే ‘యూ టర్న్’ ముందు శైలజారెడ్డి అల్లుడు తేలిపోయింది. రివ్యూలు సరిగా లేవు. తొలి మూడు రోజులు మినహాయిస్తే రెవిన్యూ కూడా అంతంత మాత్రమే. యూ టర్న్‌కి రివ్యూలు, వసూళ్లు రెండూ బాగున్నాయి. `యూ టర్న్` బాగుందన్న సంతోషం కంటే.. ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకి నెగిటీవ్ రివ్యూలు వచ్చాయన్న బాధే సమంతలో ఎక్కువ కనిపించిందట. ఈ విషయాన్ని నాగ్ వెల్లడించాడు. ”భార్యా భర్తల సినిమా ఒకే రోజు విడుదల అవ్వడం నేనెప్పుడూ చూడలేదు. రెండూ బాగా ఆడాయి. అయితే ఆ రోజు ఉదయం శైలజారెడ్డి అల్లుడ రివ్యూలు చూసి సమంత బాధ పడింది. మరేం ఫర్వాలేదు వసూళ్లు బాగుంటాయి అన్నాను. నేను అన్నట్టే శైలజారెడ్డి కి మంచి వసూళ్లు దక్కాయి. యూ టర్న్ రివ్యూలు బాగున్నా వసూళ్లు సరిగా లేవు. ఆదివారం నాటికి వసూళ్లు పెరుగుతాయి అని చెప్పా. అన్నట్టుగానే వసూళ్లు పెరిగాయి. సెప్టెంబరు మాకు బాగా కలిసొచ్చింది. ఈ సెప్టెంబరులోనే వస్తున్న దేవదాస్ ఓ పండగలా ఉంటుంది” అని జోస్యం చెప్పాడు నాగ్.